Kaikala Satyanarayana : కైకాల సత్యనారాయణ ఇకలేరు
తెలుగు చిత్రసీమలో విషాదం
Kaikala Satyanarayana : తెలుగు సినిమా రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న ప్రముఖ నటుడు కైకాల సత్యనారాయణ ఇవాళ కన్నుమూశారు. ఆయన గత కొంత కాలం నుంచి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు తన నివాసంలో కన్నుమూశారు. సినీ రంగంలో కీలకమైన పాత్రలు పోషించారు. తన కెరీర్ లో 750కి పైగా సినిమాల్లో నటించి మెప్పించారు. ప్రతి నాయకుడిగా మెప్పించారు. భిన్నమైన పాత్రలలో నటించి ఆకట్టుకున్నారు.
ఆయనకు 87 ఏళ్లు. దాదాపు 60 ఏళ్ల పాటు సినీ రంగంలో ప్రయాణం చేశారు. ఒకటా రెండా అనేక పాత్రలలో జీవించారు కైకాల సత్యనారాయణ. ప్రతి నాయకుడిగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా , హీరోగా పలు సినిమాలలో నటించారు. అంతే కాదు కొన్ని సినిమాలను నిర్మించారు. ప్రముఖ నటులతో విలన్ గా నటించారు. వైవిధ్య భరితమైన పాత్రలు పోషించినందుకు గాను కైకాల సత్యనారాయణ పలు పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు.
తెలుగు చిత్రసీమలో దిగ్గజ నటుడిగా పేరొందిన ఎస్వీ రంగారావు తర్వాత అంతటి స్థాయిలో విభిన్నమైన పాత్రలు పోషించారు కైకాల సత్యనారాయణ. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు. జూలై 25, 1935లో కౌతవరంలో పుట్టారు. ఆయనకు చిన్నప్పటి నుంచే నాటక రంగం, సినిమాల పట్ల అభిమానం ఉండేది. కైకాల సత్యనారాయణ(Kaikala Satyanarayana) కన్ను మూయడంతో తెలుగు చిత్రసీమలో తీవ్ర విషాదం అలుముకుంది.
ఇక ఆయనకు ఎక్కువగా పేరు తీసుకు వచ్చింది మాత్రం యముడి పాత్ర. ఏది ఏమైనా దిగ్గజ నటుడిని కోల్పోవడం బాధాకరం.
Also Read : జాక్వెలిన్’ పిటిషన్ ఉపసంహరణ