Saudi Arabia Bans Abaya : సౌదీలో యూనిఫాం తప్పనిసరి
స్పష్టం చేసిన సౌదీ ప్రభుత్వం
Saudi Arabia Bans Abaya : సౌదీ అరేబియా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పరీక్ష హాల్ లలో అబాయాను నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించి బాలికలు, యువత, మహిళా విద్యార్థులు స్కూల్ యూనిఫాం ధరించాలని స్పష్టం చేసింది. ఏ మాత్రం ధరించక పోయినా తీవ్రమైన చర్యలు ఉంటాయని హెచ్చరించింది.
2018లో తప్పనిసరి ధరించాలని ఏర్పాటు చేసిన అబాయను ఇక నుంచి చట్ట బద్దంగా అమలు చేయడం లేదంటూ స్పష్టం చేసింది సౌదీ అరేబియా. సౌదీ అరేబియా(Saudi Arabia Bans Abaya) ఆధ్వర్యంలోని ప్రభుత్వ విద్యా సంస్థలలో పరీక్ష హాళ్ల నుండి అబాయాను నిషేధించింది. ఇందులో భాగంగా సౌదీ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఎవాల్యూయేషన్ కమీషన్ , ఎడ్యుకేషనల్ అండ్ ట్రైనింగ్ సిస్టమ్స్ అప్రూవింగ్ బాడీ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ కీలక నిర్ణయం తీసుకోవడంలో సౌదీ అరేబియా విద్యా మంత్రిత్వ శాఖ కూడా ఉంది. ఇక విద్యా మంత్రిత్వ శాఖ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. పరిపాలన ప్రకారం పరీక్షల సమయంలో మహిళా విద్యార్థులు ఇకపై అబాయా ధరించేందుకు అనుమతించరు. పరీక్షా గదులలో పాఠశాల యూనిఫాం విధిగా ధరించాలని స్పష్టం చేసింది. ఇది పూర్తిగా పబ్లిక్ మర్యాద రూల్స్ కు కూడా కట్టుబడి ఉండాలని పేర్కొంది సౌదీ అరేబియా.
అయితే దేశంలో అనేక మంది మహిళలు వాటిని ధరించడం కొనసాగిస్తున్నప్పటికీ 2018లో అబాయా చట్ట బద్దంగా అమలు చేయాలని పేర్కొంది. ఇదిలా ఉండగా సాంప్రదాయకంగా నలుపు , లేత బ్లూస్ , పింక్ లలో మరింత రంగురంగుల అబాయాలను ధరించడం ఆనవాయితీగా వస్తోంది అక్కడ.
Also Read : ఒంటరైనా విలువలు కోల్పోలేదు – రుచిరా