Kavya Maran Viral : నెట్టింట్లో కావ్య మారన్ వైరల్
ట్విట్టర్ లో ఎస్ ఆర్ హెచ్ సిఇఓ
Kavya Maran Viral : కేరళలోని కొచ్చిలో నిర్వహించిన ఐపీఎల్ మినీ వేలం పాట ముగిసింది. మొత్తం 925 మంది ఆటగాళ్లు వేలం పాట కోసం దరఖాస్తు చేసుకుంటే బీసీసీఐ కేవలం 405 మంది ప్లేయర్లను ఎంపిక చేసింది. 10 ఫ్రాంచైజీలు వేలం పాటలో పాల్గొన్నాయి. వీరిలో కేవలం 51 మంది ఆటగాళ్లను మాత్రంఏ ఆయా జట్లు ఎంపిక చేసుకున్నాయి.
రూ. 167 కోట్లకు పైగా ఖర్చు చేశాయి. ఇక అత్యధిక ధరకు అమ్ముడు పోయాడు సామ్ కరన్ . అతడిని పంజాబ్ కింగ్స్ చేజిక్కించుకుంది. ఇక మొత్తం వేలం పాటలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కావ్య మారాన్(Kavya Maran Viral) .
ఈసారి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. వేలం పాట ప్రారంభం నుంచి ముగిసేంత దాకా కావ్య మారన్ ట్రెండింగ్ లో కొనసాగారు. ప్రస్తుతం కళానిధి మారన్ వ్యాపార సామ్రాజ్యానికి ఆమె ఏకైక వారసురాలు కావడం విశేషం. ఇక కెమెరాల కళ్లన్నీ కావ్య మారన్ వైపు ఫోకస్ పెట్టాయి.
దీంతో ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆక్షన్ ముగిసినా ఇంకా హల్ చల్ చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇంగ్లండ్ ప్లేయర్ ను భారీ ధరకు కొనుగోలు చేసింది సిఇఓ. మిగతా ఫ్రాంచైజీలను విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండగా గత సీజన్ లో తాము కొనుగోలు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఆశించిన మేర ఆడలేదు. తీవ్ర నిరాశకు గురయ్యారు కావ్య మారన్.
Also Read : కావ్య మారన్ సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్