Chalapathi Rao : నటుడు చలపతిరావు కన్నుమూత
టాలీవుడ్ లో మరో విషాదం
Chalapathi Rao : తెలుగు సినిమా రంగంలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇప్పటికే దిగ్గజ నటులు కృష్ణంరాజు, కృష్ణ తో పాటు నవరసనటనా సార్వ భౌమ అవార్డును పొందిన కైకాల సత్యనారాయణ మృతి చెందగా తాజాగా మరో ప్రముఖ నటుడు చలపతిరావు(Chalapathi Rao) కన్నుమూశారు. దీంతో టాలీవుడ్ లో తీవ్ర విషాదం అలుముకుంది.
ఆయన వయస్సు 78 ఏళ్లు. గత కొంత కాలం నుంచి ఆయన తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. సినిమా రంగానికి చెందిన ప్రముఖులు చలపతిరావు నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. చలపతిరావు స్వస్థలం కృష్ణా జిల్లా బల్లిపర్రు. మే 8, 1944లో పుట్టారు. ఆయనకు ఒక కొడుకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
వీరు అమెరికాలో ఉంటున్నారు. వారికి సమాచారం చేరవేశారు. కుటుంబీకులు వచ్చాకే చలపతిరావు అంత్యక్రియలు జరగనున్నాయి. తన సినీ కెరీర్ 1966లో ప్రారంభమైంది. చలపతిరావు(Chalapathi Rao) మొదటగా నటించింది గూఢచారి 116 చిత్రంలో. నటుడిగా గుర్తింపు పొందారు. వైవిధ్య భరితమైన సినిమాలలో నటించి ఆదరణ పొందారు.
ఆయన చిత్ర నిర్మాత కూడా. కలియుగ కృష్ణడు, జగన్నాటకం, కడప రెడ్డెమ్మ, రాష్ట్రపతి గారి అల్లుడు, పెళ్లంటే నూరేళ్ల పంట అనే చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. దివంగత నటుడు నందమూరి తారక రామారావుతో చలపతిరావుకు సాన్నిహిత్యం ఉంది. ఎన్నో విజయవంతమైన సినిమాలలో ప్రత్యేకమైన, వైవిధ్య భరితమైన పాత్రల్లో నటించారు.
ఆయన నటించిన చివరి చిత్రం బంగర్రాజు. గత ఏడాది విడుదలైంది. ఆ తర్వాత ఇక కనిపించ లేదు చలపతిరావు.గొప్ప నటుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు నటీనటులు.
Also Read : ప్రస్తుత పరిస్థితుల్లో యాత్ర అవసరం