BCCI Sri Lanka Tour : శ్రీ‌లంక టూర్ జ‌ట్టు ఎంపికపై ఉత్కంఠ

చివ‌రగా ఎంపిక చేయ‌నున్న శ‌ర్మ క‌మిటీ

BCCI Sri Lanka Tour : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది ఇప్ప‌టికే. ఆస్ట్రేలియా వేదిక‌గా జ‌రిగిన టి20 ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ లో జోస్ బ‌ట్ల‌ర్ సార‌థ్యంలోని ఇంగ్లండ్ జ‌ట్టు చేతిలో ఘోరంగా ఓడి పోయింది. దుబాయ్ లో జ‌రిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో దాయాది పాకిస్తాన్ చేతిలో 10 వికెట్ల తేడాతో ప‌రాజ‌యం మూట‌గ‌ట్టుకుంది.

సేమ్ సీన్ ఆస్ట్రేలియాలో రిపీట్ అయ్యింది. కాక పోతే తేడా ఏమిటంటే లీగ్ లో భాగంగా తొలి మ్యాచ్ లోనే పాక్ తో చావు దెబ్బతింది. ఇక ఆస్ట్రేలియాలో సెమీస్ దాకా వ‌చ్చి బొక్క బోర్లా ప‌డింది. పాకిస్తాన్ అనూహ్యంగా కీవీస్ ను ఓడించి ఫైన‌ల్ కు చేరింది. ఇంగ్లండ్ చేతిలో ఓట‌మి పాలై ర‌న్న‌ర‌ప్ గా నిలిచింది.

ఇక భార‌త జ‌ట్టు ఇంగ్లండ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓట‌మి పాలైంది. దీంతో పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు చెల‌రేగ‌డంతో భార‌త సెలెక్ష‌న్ క‌మిటీని ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు బీసీసీఐ బాస్ రోజ‌ర్ బిన్నీ. ఇప్ప‌టికే సెలెక్ష‌న్ క‌మిటీ ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించింది. ఇందు కోసం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది.

ఇదిలా ఉండ‌గా కొత్త క‌మిటీ ఏర్పాటు అయ్యేంత వ‌ర‌కు ఈ క‌మిటీ వ‌చ్చే ఏడాది 2023 జ‌న‌వ‌రిలో శ్రీ‌లంక‌లో ప‌ర్య‌టించే భార‌త జ‌ట్టును(BCCI Sri Lanka Tour) ఎంపిక చేస్తుంది. ఇందులో భాగంగా ఎవ‌రిని ఎంపిక చేస్తుంద‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

శ్రీ‌లంక జ‌ట్టుతో టీ20, వ‌న్డే సీరీస్ లు జ‌ర‌గ‌నున్నాయి. జ‌న‌వ‌రి 3న టి20 ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే రిష‌బ్ పంత్ కంటిన్యూగా విఫ‌లం చెందుతూ వ‌చ్చాడు.

Also Read : టాప్ ప్లేయ‌ర్ల‌కు ‘హైద‌రాబాద్’ ఛాన్స్

Leave A Reply

Your Email Id will not be published!