Shahid Afridi Pak Selector : పాక్ చీఫ్ సెల‌క్ట‌ర్ గా షాహీద్ అఫ్రిదీ

పీసీబీ చైర్మ‌న్ న‌జామ్ సేథీ ప్ర‌క‌ట‌న

Shahid Afridi Pak Selector : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు పాకిస్తాన్ మాజీ క్రికెట‌ర్ షాహిద్ అఫ్రిదీని చీఫ్ సెలెక్ట‌ర్ గా నియ‌మించింది(Shahid Afridi Pak Selector). ఆయ‌న‌తో పాటు మాజీ ఆట‌గాళ్లు అబ్దుల్ ర‌జా్ , రావ్ ఇఫ్తిక‌ర్ అంజుమ్ ల‌ను కూడా స‌భ్యులుగా ఎంపిక చేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించారు పీసీబీ చైర్మ‌న్ న‌జామ్ సేథీ.

న్యూజిలాండ్ తో స్వ‌దేశీ సీరీస్ కోసం పురుషుల జాతీయ సెలెక్ష‌న్ క‌మిటీకి చైర్మ‌న్ గా నియ‌మించిన‌ట్లు తెలిపారు. ర‌మీజ్ ర‌జాను తొల‌గించారు ప్ర‌ధాన‌మంత్రి షెహ‌బాజ్ ష‌రీఫ్‌. ఆయ‌న స్థానంలో న‌జామ్ సేథీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు సిఇఓగా ఉన్న వ‌సీం ఖాన్ ను కొత్త‌గా ఏర్పాటైన పీసీబీ కార్య‌వ‌ర్గం తొల‌గించింది.

2019 త‌ర్వాత ఏర్ప‌డిన క‌మిటీల‌న్నీ ర‌ద్దు చేసిన‌ట్లు వెల్ల‌డించారు పీస‌బీ చైర్మ‌న్ . కొత్త‌గా ఎంపికైన ప్యాన‌ల్ క‌మిటీకి స్వాగ‌తం ప‌లుకుతున్నా. స‌మ‌యం పరిమితంగా ఉంది. ఈ స‌మ‌యంలో అంద‌రికీ ఆమోద యోగ్యంగా ఉండేలా జ‌ట్టును ఎంపిక చేస్తార‌ని త‌న‌కు న‌మ్మ‌కంద ఉంద‌న్నారు ఎజామ్ సేథీ.

అఫ్రిది క్రికెట‌ర్ గా ప‌రిచ‌యం అంద‌రికీ. త‌న కాలంలో ఎలాంటి భ‌యం లేకుండా ఆడాడ‌ని కితాబు ఇచ్చారు. 20 ఏళ్ల పాటు అనుభ‌వం ఉంది. యువ ఆట‌గాళ్ల‌ను ప్రోత్స‌హిస్తున్నాడు. స‌వాళ్ల‌ను స్వీక‌రించి స‌త్తా చాటే ఆట‌గాళ్ల‌ను ఎంపిక చేయ‌డంలో కీల‌కంగా ఉంటాడ‌ని భావిస్తున్న‌ట్లు తెలిపారు న‌జామ్ సేథీ.

త‌న‌కు బాధ్య‌త అప్ప‌గించిన పీసీబీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు అఫ్రిదీ. మ‌రో వైపు ర‌జాక్ కూడా సంతోషం వ్య‌క్తం చేశారు.

Also Read : భార‌త్ విజ‌యం టెస్టు సీరీస్ కైవ‌సం

Leave A Reply

Your Email Id will not be published!