Sudarsan Pattnaik Santa Claus : పట్నాయ‌క్ శాంతా క్లాజ్ వైర‌ల్

సాండ్ అండ్ టొమాటో తో త‌యారీ

Sudarsan Pattnaik Santa Claus :  ప్ర‌పంచ వ్యాప్తంగా క్రిస్మ‌స్ పండుగ వాతావ‌ర‌ణం నెల‌కొంది. ఈ త‌రుణంలో మ‌రోసారి హాట్ టాపిక్ గా మారారు ప్ర‌ముఖ సాండ్ పెయింట‌ర్. ప్ర‌స్తుతం నెట్టింట్లో వెరైల్ గా మారారు. తాజాగా సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్(Sudarsan Pattnaik) సాండ్ అండ్ టొమాటో శాంతా క్లాజ్ ని త‌యారు చేశారు. 1.5 ట‌న్నుల బ‌రువు , 60 అడుగుల వెడ‌ల్పు క‌లిగి ఉంది ఇది. ప్రపంచంలోనే అతి పెద్ద టొమాటో , ఇసుక తో తయారు చేయ‌డం ఇదే మొద‌టిది అని పేర్కొన్నారు సుద‌ర్శ‌న్ ప‌ట్నాయక్.

అంత‌కు ముందు భార‌త దేశం ప్ర‌పంచంలో అత్యంత ప్రాముఖ్య‌త క‌లిగిన జీ20 శిఖ‌రాగ్ర సంస్థ‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తోంది. దీంతో ఇసుక‌తోనే ఈ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ జీ20 ప్రెసిడెన్సీ లోగోను రూపొందించారు. ఇదిలా ఉండ‌గా దేశంలో ఎంద‌రో శిల్పులు ఉన్నా ప‌ట్నాయ‌క్ వెరీ వెరీ స్పెష‌ల్. ఆయ‌న శైక‌త శిల్పిగా పేరొందారు.

ఆదివారం తాను త‌యారు చేసిన 27 అడుగుల ఇసుక‌, టొమాటో శాంతా క్లాస్ ఒడిశా లో క్రిస్మ‌స్ ఆనందోత్స‌హాల మ‌ధ్య మోగించారు. క‌ళాకృతుల‌ను చూసేందుకు గోపాల్ పూర్ బీచ్ కు పెద్ద ఎత్తున త‌ర‌లి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ త‌యారు చేసిన శాంతా క్లాజ్ ను ప్ర‌త్యేకంగా ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తారు.

ఆయ‌న ప‌నితీరును మెచ్చుకున్నారు. త‌న 15 మంది విద్యార్థుల స‌హాయంతో గంజాం జిల్లా లోని గోపాల్ పూర్ బీచ్ లో ఈ శిల్పాన్ని త‌యారు చేశాన‌ని ప‌ద్మ‌శ్రీ అవార్డు గ్ర‌హీత సుద‌ర్శ‌న్ పట్నాయ‌క్(Sudarsan Pattnaik) వెల్ల‌డించారు. గ‌తంలో క్రిస్మ‌స్ సందర్భంగా వివిధ మాధ్య‌మాల‌ను ఉప‌యోగించి త‌యారు చేశామ‌న్నారు.

కానీ ఈసారి వాట‌న్నిటికంటే భిన్నంగా ఉండాల‌ని టొమాటో, సాండ్ తో అతి పెద్ద శాంతా క్లాజ్ ను త‌యారు చేసిన‌ట్లు తెలిపారు.

Also Read : కంటెంట్ ఉన్నోళ్ల‌కు గుర్తింపు ఉంటుంది

Leave A Reply

Your Email Id will not be published!