Najam Sethi : మోదీ..షరీఫ్ చొరవ చూపాలి – సేథీ
ఇరు దేశాల మధ్య క్రికెట్ ఆట అవసరం
Najam Sethi : భారత్, పాకిస్తాన్ క్రికెట్ సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ నజామ్ సేథీ(Najam Sethi). ఈ మేరకు ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నారు. రమీజ్ రజా తర్వాత సేథీ బాధ్యతలు చేపట్టారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్నాయని, 2008 నుంచి నేటి వరకు భారత్ పాకిస్తాన్ లో పర్యటించ లేదని చెప్పారు.
దీనికి ఉద్రిక్తతలు చోటు చేసుకోవడం వల్లే ఇలా జరిగిందన్నారు. అయితే ప్రస్తుతం వాటన్నింటిని పక్కన పెట్టి భారత్ , పాకిస్తాన్ జట్లు క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అయితే ఈ నిర్ణయం తీసుకోవాల్సింది తమ చేతుల్లో లేదన్నారు. ఇందుకు గాను భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ చేతుల్లో ఉందని స్పష్టం చేశారు నజామ్ సేథీ(Najam Sethi).
ఆటలో రాజకీయాలంటూ ఉండవన్నారు. కానీ ఇరు దేశాల మధ్య సంబంధాలు సరిగా లేక పోవడం తాము కారణం కాదన్నారు. తటస్థ వేదికలలో ఇరు జట్లు తలపడ్డాయని కానీ పాకిస్తాన్ భారత్ కు వెళ్లడం లేదు. కానీ భారత్ పాకిస్తాన్ కు రావడం లేదు. దీంతో దాదాపు 14 సంవత్సరాల పాటు ఇరు దేశాలు క్రికెట్ కు దూరంగా ఉండడం తనను బాధకు గురి చేసిందన్నారు.
ఇకనైనా ఇరు దేశాల ప్రభుత్వాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. కలిసి చర్చించి ఇరు జట్లు ఆడేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. అయితే తాను ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి లోబడి పని చేస్తానని చెప్పారు నజామ్ సేథీ.
Also Read : పాక్ చీఫ్ సెలక్టర్ గా షాహీద్ అఫ్రిదీ