World Test Championship : ప‌టిష్ట స్థితిలో టీమిండియా

డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ కు ఛాన్స్

World Test Championship : బంగ్లా టూర్ లో భాగంగా జ‌రిగిన రెండు టెస్టు సీరీస్ ను 2-0 తేడాతో టీమిండియా కైవ‌సం చేసుకుంది. దీంతో భార‌త జ‌ట్టు పాయింట్ల ప‌ట్టిక‌లో మెరుగైన స్థానాన్ని చేరుకుంది. వ‌ర‌ల్డ్ టెస్టు ఛాంపియ‌న్ షిప్ కు సంబంధించి ఇప్ప‌టి వ‌ర‌కు ఆస్ట్రేలియా నెంబ‌ర్ వ‌న్ ప్లేస్ లో ఉంది.

బంగ్లాతో గ్రాండ్ విక్ట‌రీ సాధించ‌డంతో భార‌త్ నేరుగా రెండో స్థానంలోకి చేరింది. ప్ర‌పంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ కు నువ్వా నేనా అన్న రీతిలో పోటీ ప‌డ‌నున్నాయి ఆస్ట్రేలియా, టీమిండియా. అయితే భార‌త్ టూర్ లో భాగంగా ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది.

ఒక వేళ టీమిండియా గ‌నుక గెలిస్తే ఫైన‌ల్ లో ఆడ‌నుంది ఆసిస్ తో. ఇదే క్ర‌మంలో ద‌క్షిణాఫ్రికా ఆసిస్ తో ఓట‌మి పాలైంది. మ‌రో వైపు బంగ్లాను భార‌త్ ఓడించ‌డంతో పాయింట్ల ప‌ట్టిక‌లో తేడాలు వ‌చ్చాయి. రెండు టెస్టు మ్యాచ్ ల‌లో టీమ్ ఇండియా స‌త్తా చాట‌డంతో భార‌త జ‌ట్టుకు పాయింట్లు పెరిగాయి.

దీంతో ఏకంగా 58.93 పాయింట్లు సాధించింది టీమ్ ఇండియా(World Test Championship). ఇక ద‌క్షిణాఫ్రికా మూడో స్థానంలో ఉంది. ఆ జ‌ట్టు 54.55 పాయింట్ల‌తో మూడో ప్లేస్ లో ఉంది. ఇక ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్ లో భాగంగా భార‌త జ‌ట్టు ఇప్ప‌టి వ‌ర‌కు 8 టెస్టుల్లో గెలుపు సాధించింది. 4 మ్యాచ్ ల‌లో ప‌రాజ‌యం పాలైంది. 2 మ్యాచ్ ల‌ను డ్రా చేసుకుంది టీమిండియా.

మ‌రో వైపు సౌతాఫ్రికా, శ్రీ‌లంక జ‌ట్లు కూడా టెస్టుల్లో గెలుపొందితే స‌మీక‌ర‌ణాలు మారే ఛాన్స్ లేక పోలేదు.

Also Read : నిఖ‌త్ జ‌రీన్ ఛాంపియ‌న్

Leave A Reply

Your Email Id will not be published!