Celebrity suicides Comment : కదిలే బొమ్మలు కన్నీటి కథలు
రంగుల కలలు ఆత్మహత్యలు
Celebrity suicides Comment : రంగుల లోకంగా ప్రసిద్ది చెందింది సినిమా రంగం. గత కొంత కాలం నుంచి చూస్తే పెద్ద ఎత్తున ఆత్మహత్యకు పాల్పడిన వారిలో సినీ రంగానికి చెందిన వారే కావడం విశేషం.
తాజాగా యువ నటి తుషార్ శర్మ సీరియల్ షూట్ జరుగుతుండగా సూసైడ్ చేసుకుంది. ఆమె మరణం వెనుక సహ నటుడు షీజాన్ ఖాన్ ఉన్నాడని తల్లి వనితా శర్మ ఆరోపించింది.
ఆశలు..ఆరాటాల మధ్యన ఊగిసలాడుతూ తట్టుకోలేక ఒత్తిడిని జయించ లేక ఆత్మహత్యలకు(Celebrity suicides) పాల్పడుతున్న వారు ఎందరో ఉన్నారు.
వీరిలో ఎక్కువగా వినోద రంగానికి చెందిన వారే కావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. అద్దాల మేడల్లో జీవిస్తూ అదే ప్రపంచమని అనుకుంటూ ఉండే వాళ్లకు వాస్తవం తమ దరిదాపుల్లోకి వచ్చే సరికల్లా తట్టుకోలేక పోతున్నారు.
అక్టోబర్ 16న యే రిష్తా క్యా కెల్లాతా హై తో పేరొందిన నటి వైశాలీ ఠక్కర్ ఇండోర్ తన ఇంట్లో శవమై కనిపించింది. ఆమె మాజీ ప్రియుడు రాహుల్ నవ్లానీ ప్రమేయం ఉందంటూ పేర్కొన్నారు పోలీసులు.
జబ్ వి మెట్ , వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై , ది ఫ్యామిలీ మ్యాన్ -2 , సూర్య వంశీ లో నటించి మెప్పించిన ఆసిఫ్ బాసర 2020లో ధర్మ శాలలోని ఓ ఇంట్లో ఉరి వేసుకున్నాడు. ఇక బుల్లి తెరపై క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లాంటి పాపులర్ షోస్ తో టాప్ లో కొనసాగిన సమీర్ శర్మ ముంబై శివారు మలాడ్ లో సూసైడ్ చేసుకున్నాడు.
ఇక దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన కేసు ప్రముఖ నటుడిగా పేరొందిన సుశాంత్ సింగ్ రాజ్ పుత్. జూన్ 14, 2020న మరాఠా లోని బాంద్రా లోని ఇంట్లో ఉరి వేసుకుని కనిపించాడు. ఈ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.
ఇక కాల్ , లక్ష్య సినిమాలతో పాటు ఫియర్ ఫ్యాక్టర్ అనే పాపులర్ రియాల్టీ షోతో దుమ్ము రేపుతూ వచ్చిన కుశాల్ పంజాబీ 2019లో బాంద్రా అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఇక ప్రెజ్ఞా మెహతా క్రైమ్ పెట్రోల్ లో నటించింది. ఆమెకు 29 ఏళ్లు. ఇండోర్ లోని తన ఇంట్లో శవమై కనిపించింది.
2016లో ప్రముఖ టీవీ సోప్ ఒపెరా లో బాలికా వధు ద్వారా ఇంటి పేరుగా మార్చుకున్న ప్రత్యూషా బెనర్జీ ముంబై లోని తన అపార్ట్ మెంట్ లో ఉరి వేసుకుని చని పోయింది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ కారణమని పోలీసులు పేర్కొంటున్నారు.
మరో విషాదకరమైనది ఏమిటంటే..చిన్న వయస్సులోనే అద్భుత నటనతో ఆకట్టుకుంది జియా ఖాన్. నిశ్శబ్ద్ , గజిని వంటి చిత్రాలలో నటించి పేరు తెచ్చుకుంది. జూన్ 3, 2013లో ముంబై నివాసంలో సూసైడ్ చేసుకుంది. ఆమె ఆత్మహత్యకు ప్రియుడు , నటుడు సూరజ్ పంచోలీ ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఆర్తి అగర్వాల్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఇక తమిళ , తెలుగు సినిమా రంగంలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సృష్టించుకున్న నటి సిల్క్ స్మిత. 1996 అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. 200కు పైగా చిత్రాలలో నటించారు.
1997లో మిస్ ఇండియా టైటిల్ గెలుపొందిన నఫీసా జోసెఫ్ 2004లో వెర్సోవా లోని తన నివాసంలో 25 ఏళ్ల వయస్సులో ఉరి వేసుకుని చని పోయారు.
తెలుగులో ఉదయ్ కిరణ్ , రంగనాథ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక దివ్య భారతి మరణం ఓ విషాదం. ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనంత మంది..లెక్క లోకి రాని వారు ఎందరో ఉన్నారు.
రాలి పోతున్నారు. వీరందరి మరణం వెనుక..ఆత్మహత్యల వెనుక ప్రేమ రాహిత్యం(Celebrity suicides) తో పాటు నిరాదరణ కూడా ఉంది. ఒంటరితనం ప్రధాన కారణంగా తోస్తోంది.
ఏది ఏమైనా కలల ప్రపంచం..రంగులు మిరుమిట్లు గొలిపే సినిమా రంగం కను రెప్పలను కాటేస్తోంది..చిరు నవ్వులను చిదిమేస్తోంది. దీనికి అంతం ఎప్పుడో కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : ఈ చిరునవ్వును చిదిమింది ఎవరు