Sanju Samson vs Surya Yadav : సూర్య భాయ్ కు ప్ర‌మోష‌న్

ముంబై ఆట‌గాళ్ల‌కే బీసీసీఐ ప్రాధాన్యం

Sanju Samson vs Surya Yadav : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు మ‌రోసారి సంజూ శాంస‌న్ పై వివ‌క్ష చూపింది. భార‌త్ లో జ‌న‌వ‌రి 3 నుంచి ప్రారంభం కానున్న శ్రీ‌లంక టూర్ కు సంబంధించి టీ20, వ‌న్డే సీరీస్ కు జ‌ట్ల‌ను వేర్వేరుగా ఎంపిక చేసింది. సెలెక్ష‌న్ క‌మిటీ నిద్ర పోతున్న‌దా అన్న అనుమానం వ్య‌క్తం అవుతోంది. టీ20 జ‌ట్టులో సంజూ కు గ‌త్యంత‌రం లేక చోటు క‌ల్పించింది.

కానీ వ‌న్డే సీరీస్ కు మాత్రం ఎంపిక చేయ‌క పోవ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. గ‌త కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తూ వ‌స్తున్నాడు సంజూ శాంస‌న్. కావాల‌ని అత‌డిని ఎంపిక చేయ‌కుండా వివ‌క్ష(Sanju Samson vs Surya Yadav) చూపిస్తూ వ‌స్తోంది. సోష‌ల్ మీడియా వేదిక‌గా బీసీసీఐ ఏక‌ప‌క్ష నిర్ణ‌యాల‌ను త‌ప్పు ప‌డుతున్నారు.

కొంత కాలం నుంచి పెద్ద ఎత్తున ట్రోలింగ్ న‌డుస్తూ వ‌స్తోంది. ఇక బీసీసీఐ పూర్తిగా భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆఫీసుగా మారింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

సూర్య కుమార్ యాద‌వ్ ఇటీవ‌ల స‌త్తా చాట‌డంతో ఏకంగా వైస్ కెప్టెన్ గా ఎంపిక చేసింది. మ‌రో వైపు నాయ‌క‌త్వ బాధ్య‌త‌ల‌న్నీ ముంబై ఆట‌గాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇస్తుండ‌డంపై కూడా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

వ‌చ్చే ఏడాది 2023లో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ భార‌త్ లో నిర్వ‌హించాల్సి ఉంది. ఆసియా క‌ప్ పాకిస్తాన్ లో జ‌ర‌గ‌నుంది. వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌రిగే కంటే ముందు జ‌రిగే వ‌న్డే సీరీస్ ల‌కు అనుభ‌వం క‌లిగిన సంజూ శాంస‌న్ ను ఎంపిక చేయ‌క పోవ‌డాన్ని త‌ప్పు ప‌డుతున్నారు మాజీ క్రికెట‌ర్లు.

Also Read : సంజూ శాంస‌న్ పై బీసీసీఐ వివ‌క్ష

Leave A Reply

Your Email Id will not be published!