Congress Formation Day : అరుదైన చ‌రిత్ర కాంగ్రెస్ ఘ‌న‌త‌

ఘ‌నంగా కాంగ్రెస్ వ్య‌వ‌స్థాప‌క దినోత్సవం

Congress Formation Day : భార‌త దేశ చ‌రిత్ర‌లో కాంగ్రెస్ పార్టీకి ఘ‌న‌మైన వార‌స‌త్వం ఉంది. అంత‌కు మించిన చరిత్ర ఉంది. ఆ పార్టీ ఏర్పాటై డిసెంబ‌ర్ 28, 2022 నాటితో 138 ఏళ్లు. ప్ర‌పంచంలోనే అత్యంత పురాత‌న‌మైన పార్టీగా(Congress Formation Day) పేరు పొందింది. ఎంద‌రో నాయ‌కులు, మ‌హానుభావులు ఈ పార్టీలో ఉన్నారు. దీని నీడ‌న ఉంటూ ఉన్న‌త స్థానాల‌ను అధిరోహించారు.

జాతికి సేవ‌లు అందించారు. ఇంకొంద‌రు విభేదించారు. కానీ పార్టీ మాత్రం అలాగే ఉంది. చీలిక‌లు వ‌చ్చినా, మ‌రికొంద‌రు పార్టీని వీడినా ఏ మాత్రం చెక్కు చెద‌రలేదు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి బ‌ల‌మైన నాయ‌క‌త్వం ఉంది. అంత‌కు మించిన కార్య‌క‌ర్త‌ల బ‌లం ఉంది. ఢిల్లీలోని పార్టీ కార్యాల‌యంలో పార్టీ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు.

పార్టీ చీఫ్ ఖ‌ర్గే తో పాటు సోనియా, రాహుల్ , ఇత‌ర ముఖ్య నేత‌లు పాల్గొన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీని అల‌న్ ఆక్టేవియ్ హ్యూమ్ స్థాపించారు. 1883 మార్చిలో కోల్ క‌త్తా యూనివ‌ర్శిటీ గ్రాడ్యుయేట్ ల‌ను క‌లిసి భార‌త స్వాతంత్రం కోసం క‌లిసి ప‌ని చేయాల‌ని విన్న‌వించిన మొద‌టి వ్య‌క్తి. హ్యూమ్ ఇచ్చిన పిలుపు ఎన్నో మార్పుల‌కు శ్రీ‌కారం చుట్టేలా చేసింది.

ఆనాటి విద్యావంతుల‌పై పెను ప్ర‌భావం చూపింది. ఇందుకు సంబంధించి అఖిల భార‌త సంస్థ అవ‌స‌ర‌మ‌ని భావించారు. ఆ దిశ‌గా మొద‌టి అడుగు సెప్టెంబ‌ర్ , 1884లో అడ‌యార్ (మ‌ద్రాస్ ) లో జ‌రిగిన థియోసాఫిక‌ల్ సొసైటీ వార్షిక సెష‌న్ లో హ్యూమ్ , నౌరోజీ, సురేంద్ర నాథ్ బెన‌ర్జీ , త‌దిత‌రులు పాల్గొన్నారు.

అనంత‌రం ఇండియ‌న్ నేష‌న‌ల్ యూనియ‌న్ పేరుతో దేశ వ్యాప్తం సంస్థ ఏర్పాటైంది. దీని ఉద్దేశం భార‌త దేశ సామాజిక స‌మ‌స్య‌ల‌ను చ‌ర్చించ‌డం. ఆ త‌ర్వాత కాంగ్రెస్ పార్టీగా మారింది. స్వాతంత్ర పోరాటంలో కీల‌క పాత్ర పోషించింది. ఎన్నో మార్పుల‌కు వేదిక‌గా నిలిచింది.

ఒక పార్టీ సుదీర్ఘ కాలం పాటు మ‌న‌గ‌ల‌గ‌డం మామూలు విష‌యం కాదు. ఏకంగా 138 ఏళ్లు. ఇది ఓ చ‌రిత్ర‌. అరుదైన ఘ‌న‌త‌. ఆ పార్టీ ఇప్ప‌టికీ దేశాన్ని ప్ర‌భావితం చేయ‌గ‌లిగే స్థాయిలో ఉంది. ప్ర‌స్తుతం తీవ్ర ఒడిదుడుకుల‌ను ఎదుర్కొంటోంది. దీనికి చికిత్స చేయాల్సిన బాధ్య‌త గాంధీ ఫ్యామిలీపైనే ఉంది.

మొత్తంగా పార్టీ ప్ర‌స్తుతం కుటుంబ పార్టీ అనే విమ‌ర్శ‌లు ఎదుర్కొంటోంది. ఏది ఏమైనా ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఎద‌గాల్సిన అవ‌సరం ఎంతైనా ఉంద‌నేది పార్టీ బాధ్యులు గ‌మ‌నించాలి. లేక పోతే పార్టీ ఉనికికి ఏర్ప‌డే ప్ర‌మాదం పొంచి ఉంది.

Also Read : జోడో యాత్ర‌తో కాంగ్రెస్ లో జోష్

Leave A Reply

Your Email Id will not be published!