Mahima Swamy Award : సైంటిస్ట్ ‘మ‌హిమ‌’కు అరుదైన గౌర‌వం

స్వ‌స్థ‌లం బెంగ‌ళూరులో యుకెల్ నివాసం

Mahima Swamy Award : ప్ర‌వాస భార‌తీయులు ప్ర‌తిభా పాట‌వాల‌తో అల‌రిస్తున్నారు. అద్భుతాలు చేస్తున్నారు. అన్ని రంగాల‌లో త‌మ‌దైన ముద్ర‌తో రాణిస్తున్నారు. అటు ఐటీలో ఇటు ఫార్మా, శాస్త్ర‌, సాంకేతిక రంగాల‌లో టాప్ లో నిలుస్తున్నారు. తాజాగా మ‌రో ప్ర‌వాస భార‌తీయురాలు డాక్ట‌ర్ మ‌హిమా స్వామికి అరుదైన గౌర‌వం(Mahima Swamy) ల‌భించింది.

ఆమె స్వ‌స్థ‌లం బెంగ‌ళూరు. భార‌తీయ శాస్త్ర‌వేత్త‌గా గుర్తింపు పొందారు ఇప్ప‌టికే. జీవ‌శాస్త్రంలో యూర‌ప్ లోని అత్యుత్త‌మ ప్ర‌తిభావంతుల్లో ఒక‌రిగా అవార్డు ల‌భించింది. స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ లోని డూండీ విశ్వ విద్యాల‌యం లోని అత్యంత గౌర‌వ‌నీయ నిపుణుల‌లో ఒక‌రిగా ఉన్నారు.

ఇందులో భాగంగా ప్ర‌తిష్టాత్మ‌క‌మైన యూరోపియ‌న్ మాలిక్యుల‌ర్ బయాల‌జీ ఆర్గ‌నైజేష‌న్ (ఈఎంబీఓ) యంగ్ ఇన్వెస్టిగేట‌ర్ నెట్ వర్క్ లో చేరేందుకు భార‌తీయ శాస్త్ర‌వేత్త ఎంపిక‌య్యారు. అక్క‌డ ఆమె ప్రేగుల‌లో రోగ నిరోధ‌క శ‌క్తిని ఎలా పెంపొందించాల‌నే దానిపై ప‌రిశోధ‌న‌లు చేస్తున్నారు డాక్ట‌ర్ మ‌హిమా స్వామి.

మెడిక‌ల్ రీసెర్చ్ కౌన్సిల్ ప్రొటీన్ ఫాస్పోరైలేష‌న్ , యుబిక్విటిలేష‌న్ యూనిట్ లో ఉన్నారు. 135 మంది ప్ర‌స్తుత శాస్త్ర‌వేత్త‌ల‌తో పాటు 390 మంది మాజీ స‌భ్యుల నెట్ వ‌ర్క్ లో మ‌హిమా స్వామి(Mahima Swamy) చేరారు.

ఇదిలా ఉండ‌గా ఈ నెట్ వ‌ర్క్ లో భాగ‌మైనందుకు సంతోషంగా ఉంద‌న్నారు డాక్ట‌ర్ మ‌హిమా స్వామి. అంతే కాకుండా ఐరోపా అంత‌టా అత్యాధునిక ప‌రిశోధ‌న‌లు చేస్తున్న డైన‌మిక్ యువ శాస్త్ర‌వేత్త‌లంద‌రినీ క‌లుస్తున్నందుకు ఆనందంగా ఉంద‌ని పేర్కొన్నారు.

ఈ స‌మూహంలో భాగం అవుతాన‌ని తాను క‌ల‌లో కూడా అనుకోలేద‌ని తెలిపారు. ఈ అత్యున్న‌త‌మైన పుర‌స్కారానికి ఎంపిక చేసినందుకు ధ‌న్య‌వాదాలు అని తెలిపారు.

Also Read : సంస్కారం లేక పోతే స‌ర్వ నాశ‌నం

Leave A Reply

Your Email Id will not be published!