Electoral Bonds Comment : ఎల‌క్టోర‌ల్ బాండ్లు పార్టీల‌కు కోట్లు

అక్ర‌మ సంపాద‌నంతా స‌క్ర‌మ‌మే

Electoral Bonds Comment : ఈ దేశంలో దోచుకుకున్నోళ్ల‌కు దోచుకున్నంత‌. చ‌ట్టాల్లో లొసుగులు అక్ర‌మార్కుల‌కు అందివ‌చ్చిన అవ‌కాశంగా మారాయి. పాల‌కులు, వ్యాపారులు, సంస్థ‌లు, ఆర్థిక నేర‌గాళ్లు, వైట్ కాల‌ర్ దొంగ‌లు ఒక్క‌టై పోయాక ఇక దేశంలో ప్ర‌జాస్వామ్యం అన్న‌ది చెప్పుకోవ‌డానికే ప‌నికి వ‌స్తుంది.

బ్యాంకుల‌కు క‌న్నం వేసి కోట్లు నొక్కేసిన బ‌డా బాబులు దేశం దాటి వెళ్లి పోయారు. ఇది ప‌క్క‌న పెడితే బ‌హిరంగ దోపిడీకి ప‌రాకాష్ట ఏదైనా ఉందంటే అది ఎల‌క్టోర‌ల్ బాండ్లు.

దేశంలోని రాజ‌కీయ పార్టీల‌కు ఈ బాండ్లు క‌ల్ప‌త‌రువుగా మారాయి. న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం కొలువు తీరాక బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వం ఫ‌క్తు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది.

దొడ్డి దారిన కాకుండా సంస్థ‌లు, వ్య‌క్తులు, కంపెనీలు త‌మ‌కు తోచినంత మేర ఎన్ని కోట్లు అయినా ఆయా రాజ‌కీయ పార్టీల‌కు ఇవ్వ వ‌చ్చు ఈ ఎల‌క్టోర‌ల్ బాండ్ల ద్వారా. దీనిని 2017-2018లో యూనియ‌న్ బ‌డ్జెట్ లో ప్ర‌క‌టించారు.

ఆనాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఆధ్వ‌ర్యంలో దీనిని ఆమోదించారు. ఎల‌క్టోర‌ల్ బాండ్లు వేల కోట్లు కొల్ల‌గొట్టాయి. అధికారంలో ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీ అగ్ర స్థానంలో ఉంది. 

ఇది ప‌క్క‌న పెడితే చిన్నా చిత‌కా పార్టీలు కూడా కోట్ల రూపంలో తీసుకుంటున్నాయి. దీనికి లెక్కా పత్రం ఉండ‌దు. ఎల‌క్టోర‌ల్ బాండ్(Electoral Bonds) అనేది భార‌త దేశంలో రాజ‌కీయ నిధుల వ్య‌వ‌స్థ‌ను ప్ర‌క్షాళ‌న చేసేందుకు చేసిన ప్ర‌య‌త్నమ‌ని కాషాయ స‌ర్కార్ వెల్ల‌డించింది. 

ఈ బాండ్లు అనేవి రాజ‌కీయ పార్టీల‌కు విరాళాలు ఇచ్చే ఆర్థిక సాధ‌నం. వీటిని ఉద్దేశించిన దాత‌ల‌కు కేంద్ర స‌ర్కార్ నుండి అనుమ‌తిపై షెడ్యూల్డ్ క‌మర్షియ‌ల్ బ్యాంకులు జారీ చేస్తాయి. 

ఈ బాండ్లు జారీ నుండి నిర్ణీత గ‌డువు లోపు న‌మోదిత రాజ‌కీయ పార్టీకి చెందిన ఖాతాలో జ‌మ చేస్తారు. ఆర్బీఐ చ‌ట్టం 1934 సెక్ష‌న్ 31(3) , ప్ర‌జా ప్రాతినిధ్య చ‌ట్టం , 1951కి అవ‌స‌ర‌మైన స‌వ‌ర‌ణ‌ల ఆర్థిక బిల్లు, 2017లోని సెక్ష‌న్ 133 నుండి 136 దాకా చేశారు. 

మోదీ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని జ‌న‌వ‌రి 2, 2018న నోటిఫై చేసింది. బాండ్లు ప్రామిస‌రీ నోట్స్ లో ఉంటాయి. కానీ దాత ఎవ‌రనేది తీసుకునే వారికి తెలియ‌దు. ఆయా పార్టీలు ఈ బాండ్ల‌ను వారి బ్యాంకు ఖాతాల ద్వారా తిరిగి డ‌బ్బుగా మార్చుకునేందుకు వీలు క‌లుగుతుంది. 

కాగా ఉప‌యోగించే బ్యాంకు ఖాతా గురించి ఎన్నిక‌ల క‌మిష‌న్ కు తెలియ చేయాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ఫాయిదా లేదు. ఈ బాండ్ల‌పై రుణాలు ఇవ్వ‌రు.

ఎస్బీఐ నుండి రూ. 1,000, రూ. 10,000, రూ. 1,00,000 , రూ, కోటి దాకా జారీ చేస్తారు. ఒక‌రైనా లేదా సంస్థ ప‌రంగా కొనుగోలు చేసేందుకు వీలు క‌లుగుతుంది. 

ఈ బాండ్ల స‌మ‌యం 15 రోజులు మాత్ర‌మే ఉంటుంది. సాధార‌ణ ఎన్నిక‌ల సంవ‌త్స‌రంలో కేంద్ర స‌ర్కార్ 30 రోజుల అద‌న‌పు వ్య‌వ‌ధిని ఇస్తుంది. 

ఒక వ్య‌క్తి నుండి రూ. 2000 జ‌మ చేయొచ్చు. లేదా ఎక్కువ కూడా ఇవ్వ‌వ‌చ్చు. దీనికి సెక్ష‌న్ 80జీజీబీ కింద మిన‌హాయింపు ల‌భిస్తుంది. విచిత్రం ఎన్ని వ‌చ్చాయి..ఏయే సంస్థ‌లు ఇచ్చాయ‌నే దానికి సంబంధించి లెక్క‌లు ఉండ‌వు.

సో ..దొంగ‌ల‌కు, సంస్థ‌ల‌కు, అక్ర‌మార్కుల ద్వారా రాజ‌కీయ పార్టీల‌కు బాండ్ల(Electoral Bonds) ద్వారా విరాళాలు లెక్క‌లేనంత‌గా అందుతున్నాయి. ఆయా సంస్థ‌లు క్విడ్ అండ్ ప్రో లెక్క‌న త‌మ ప‌నులు చేసుకుంటున్నాయ‌నే ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

న‌ల్ల ధ‌నం వెలికి తీసేందుకు తీసుకు వ‌చ్చామ‌ని చెబుతున్నా కోట్లాది రూపాయ‌లు పార్టీల‌కు వ‌రంగా మారాయ‌న‌డంలో సందేహం లేదు.

Also Read : హైకోర్టు షాక్ ‘పైల‌ట్’ ప‌రేషాన్

Leave A Reply

Your Email Id will not be published!