PCB Slams Ramiz Raja : రమీజ్ రజాపై చట్ట పరమైన చర్యలు
వస్తువులు తీసుకోనీయడం లేదని ఫైర్
PCB Slams Ramiz Raja : పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మాజీ చైర్మన్ రమీజ్ రజా కొత్తగా ఎంపికైన చైర్మన్ నజామ్ సేథీపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఈ మేరకు రమీజ్ రజాపై(PCB Slams Ramiz Raja) చట్ట పరమైన చర్యలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. నజామ్ సేథీని టార్గెట్ చేస్తూ రావడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది.
అంతే కాకుండా పీసీబీ ప్రతిష్టను దిగజార్చేలా కామెంట్స్ చేశారంటూ ఆరోపించింది. ఈ మేరకు రజాపై నిప్పులు చెరిగింది ప్రస్తుత బోర్డు. ఇదిలా ఉండగా రమీజ్ రాజా అనాలోచిత నిష్క్రమణ తర్వాత బోర్డు కొత్త మేనేజ్ మెంట్ కమిటీ , మాజీ చైర్మన్ మధ్య మాటల యుద్దం చెలరేగడంతో చర్యలు తప్పవని స్పష్టం చేసింది పీసీబీ.
రమీజ్ రజా తన స్వంత యూట్యూబ్ ఛానల్ తో పాటు సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఆయన వాడిన భాష అభ్యంతరకరంగా ఉందని, చేసిన కామెంట్స్ దారుణంగా ఉన్నాయని పేర్కొంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. విచిత్రం ఏమిటంటే రమీజ్ రజా ఇదే సంస్థకు చైర్మన్ గా ఉన్నారని ఆ విషయం మరిచి పోతే ఎలా అని ప్రశ్నించింది పీసీబీ(PCB Slams Ramiz Raja) .
ఆయన తన వస్తువులను తీసుకోనీయ లేదంటూ విమర్శలు చేయడం దారుణమని పేర్కొంది. ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయడం రమీజ్ రజా లాంటి దిగ్గజ క్రికెటర్ కు తగదని , తాము ఊహించ లేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మండిపడింది. సంస్థ విశ్వసనీయతను కావాలని దెబ్బ తీసేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని, అందుకే లీగల్ గా చర్యలు తీసుకునే విషయంపై చర్చిస్తున్నట్లు తెలిపింది పీసీబీ.
Also Read : శ్రీలంక టీ20..వన్డే జట్ల ఎంపిక