Shikhar Dhawan : ధావ‌న్ భ‌విత‌వ్యం ప్ర‌శ్నార్థకం

శ్రీ‌లంక టూర్ కు మంగ‌ళం

Shikhar Dhawan : భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ)లో ఉన్న‌న్ని రాజ‌కీయాలు ఇంకెక్క‌డా ఉండ‌వు. ఎందుకంటే కోట్లాది రూపాయ‌ల ఆదాయం క‌లిగిన సంస్థ‌. ప్ర‌స్తుతం భార‌తీయ జ‌న‌తా పార్టీకి కేరాఫ్ గా మారింద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఇటీవ‌ల చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు, ఆట‌గాళ్ల ఎంపిక‌పై అనుస‌రిస్తున్న విధానాలు తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారి తీస్తున్నాయి.

విచిత్రం ఏమిటంటే బాగా ఆడుతున్న సంజూ శాంస‌న్ ను వ‌న్డే సీరీస్ కు ఎంపిక చేయ‌లేదు. కేవ‌లం టీ20కి మాత్ర‌మే ప‌రిమితం చేశారు. గ‌త కొంత కాలం నుంచీ సోష‌ల్ మీడియాలో శాంస‌న్ ట్రెండింగ్ లో ఉన్నాడు. అత‌డితో పాటు బీసీసీఐ తీవ్ర ట్రోలింగ్ కు గుర‌వుతోంది. ఎవ‌రైనా ఆడే వాళ్ల‌ను తీసుకుంటారు. ఆడ‌ని వాళ్ల‌కు ప్ర‌యారిటీ ఇవ్వ‌రు. కానీ బీసీసీఐ సెలక్ష‌న్ క‌మిటీ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది.

ఇప్ప‌టికే స‌ద‌రు క‌మిటీని ర‌ద్దు చేసింది బోర్డు. కొత్త క‌మిటీ ఎంపిక కోసం ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. తాజాగా మ‌రోసారి బీసీసీఐ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. భార‌త్ లో ప‌ర్య‌టించే శ్రీ‌లంక టూర్ కు వెట‌ర‌న్ ఓపెన‌ర్ శిఖ‌ర్ ధావ‌న్(Shikhar Dhawan) ను ప‌క్క‌న పెట్టేసింది. దీంతో అత‌డిని పూర్తిగా ప‌క్క‌న పెట్టేశార‌న్న ప్ర‌చారం జోరందుకుంది.

2023లో ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. ఇందులో పార్టిసిపేట్ చేయాల‌ని క‌ల క‌న్నాడు. ఆ త‌ర్వాత రిటైర్మెంట్ ప్ర‌క‌టిద్దామ‌ని అనుకున్నాడు. కానీ సీన్ రివ‌ర్స్ అయ్యింది. ప‌లు సీరీస్ ల‌కు కెప్టెన్ గా ఉన్నాడు. ఇటీవ‌ల కొంత ఫామ్ కోల్పోవ‌డం కూడా ఇబ్బందిగా మారింది.

ఓపెన‌ర్లుగా ఇషాన్ కిష‌న్ , శుభ్ మ‌న్ గిల్ రాణిస్తుండ‌డంతో శిఖ‌ర్ ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లు టాక్. ప‌రిమిత ఓవ‌ర్ల‌లో పూర్ ప‌ర్ ఫార్మెన్స్ ప్ర‌ద‌ర్శించిన రిష‌బ్ పంత్ పై కూడా వేటు వేశారు.

Also Read : కేన్ మామ అదుర్స్ కీవీస్ సూప‌ర్

Leave A Reply

Your Email Id will not be published!