Pele Died : ఫుట్‌బాల్ దిగ్గ‌జం పీలే క‌న్నుమూత

లోకాన్ని వీడిన రారాజు ఇక లేరు

Pele Died : ఫుట్‌బాల్ రంగంలో రారాజుగా వెలుగొందిన బ్రెజిల్ దిగ్గ‌జం పీలే క‌న్ను మూశారు(Pele Died) . ఇక సెల‌వంటూ లోకాన్ని వీడారు. యావ‌త్ దేశం శోక‌సంద్రంలో మునిగి పోయింది. పీలే సార‌థ్యంలో బ్రెజిల్ దిగ్విజ‌యంగా వెలుగొందింది. ఏకంగా మూడుసార్లు ఫుట్ బాల్ ప్ర‌పంచ క‌ప్ గ‌లుపొందింది.

1958, 1962, 1970ల‌లో పీలే నేతృత్వంలో బ్రెజిల్ జ‌గ‌జ్జేత‌గా నిలిచింది. అంతే కాదు ఫుట్ బాల్ చ‌రిత్ర‌లో పీలే అరుదైన చ‌రిత్ర‌ను సృష్టించాడు. మూడు వ‌ర‌ల్డ్ క‌ప్ లు గెలుపొందిన ఏకైక సార‌థిగా నిలిచాడు పీలే. ఆయ‌న వ‌య‌స్సు 82 ఏళ్లు. గ‌త కొంత కాలం నుంచి పీలే క్యాన్స‌ర్ వ్యాధితో బాధ ప‌డుతున్నారు.

ఈ సంద‌ర్భంగా దిగ్గ‌జ ఆట‌గాడు తుదిశ్వాస విడిచిన‌ట్లు పీలే(Pele Died)  కూతురు సోష‌ల్ మీడియా వేదిక‌గా పేర్కొంది. నీవు లేని లోకం శూన్యం..నాన్నా వుయ్ మిస్ యూ అంటూ పేర్కొంది. ఫుట్ బాల్ ప్ర‌పంచం ఒక్క‌సారిగా దిగ్భ్రాంతికి లోనైంది. ఎంతో మంది వ‌ర్ద‌మాన ఆట‌గాళ్ల‌కు పీలే స్పూర్తి దాయ‌కంగా నిలిచాడు పీలే.

ఒక ర‌కంగా చెప్పాలంటే ఏ శ‌తాబ్దంలో నైనా పీలే దిగ్గ‌జ ఆట‌గాడిగా పేర్కొనడంలో త‌ప్పు లేద‌న్నాడు అర్జెంటీనా దివంగ‌త ఆట‌గాడు డిగీ మార‌డోనా. ఇక మోస్ట్ పాపుల‌ర్ ఫ్రాన్స్ ఫుట్ బాల్ ప్లేయ‌ర్ ఎంబాప్పే అయితే పీలే నువ్వు లేవ‌న్న నిజం అబ‌ద్దం..నువ్వు స‌జీవం అని పేర్కొన్నాడు.

క‌న్నీటి ప‌ర్యంతం అయ్యాడు. ఆయ‌న అందించిన స్పూర్తి ఎల్ల‌ప్ప‌టికీ ఉంటుంద‌ని తెలిపాడు. ఇక 1971లో వీడ్కోలు తీసుకున్నాడు. త‌న ఫుట్ బాల్ కెరీర్ లో 1363 మ్యాచ్ లు ఆడాడు. 1281 గోల్స్ చేశాడు.

Also Read : ఫుట్‌బాల్ దేవుడు స్వ‌ర్గంలో ఉన్నాడు

Leave A Reply

Your Email Id will not be published!