Pele The king : ఫుట్బాల్ దేవుడు స్వర్గంలో ఉన్నాడు
ఇక సెలవంటూ వెళ్లి పోయిన రారాజు
Pele The king : ఫుట్బాల్ ప్రపంచాన్ని తన అద్భుతమైన ఆట తీరుతో అలరిస్తూ వచ్చిన రారాజు పీలే(Pele The king) ఇక సెలవంటూ వెళ్లి పోయారు. ఇక రానంటూ లోకాన్ని వీడారు.
స్వర్గంలో సేద దీరేందుకు వెళతానంటూ గుడ్ బై చెప్పారు. ఇవాళ లోకానికి చీకటి రోజు. 1940 నుంచి 1922 వరకు పీలే జ్ఞాపకాలతో ఫుట్ బాల్ ప్రపంచం సేదదీరింది. యావత్ ప్రపంచాన్ని తన ఆటతో ప్రేమలో పడేలా చేసిన పుట్ బాల్ లో తొలి గ్లోబల్ స్టార్ పీలే 82వ ఏట కన్నుమూశారు.
లెక్కకు మించిన అభిమానుల్ని సంపాదించుకున్న పీలే ఇక లేరన్న వార్తను జీర్ణించు కోలేక పోతున్నారు. ఫుట్ బాల్ రంగంలో అతడు విజేతగా నిలిచాడు. ఏకంగా మూడుసార్లు బ్రెజిల్ ను ఛాంపియన్ గా నిలిపాడు తన సారథ్యంలో.
ఈ రికార్డును ఎవరూ బ్రేక్ చేయలేక పోయారు. క్యాన్సర్ భూతం అతడిని కమ్మేసింది. సావో పాలో లోని ఆస్పత్రిలో చివరి క్షణం వరకు చిరునవ్వుతోనే ఉన్నాడు పీలే.
ఆయనకు తండ్రి పెట్టిన పేరు డోండి హూ. తన ఆత్మకథ రాసిన రచయితతో పీలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పీలే ఎన్నటికీ చని పోడు.
సజీవంగా లోకం ఉన్నంత దాకా ఉంటాడని పేర్కొన్నాడు. పీలే మొదటి పేరు డిచో. ప్రారంభ రోజుల్లో గ్యాసోలినా. స్థానిక ఫుట్ బాల్ గోల్ కీపర్ బైల్ పేరు చెప్పాడు..అది కాస్తా పైల్ అని విన్నాడు..అదే చివరగా పీలే గా మారి పోయింది.
ఎలాంటి అర్థం లేని ఈ పదం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా చేసింది. ఫుట్ బాల్ ప్రపంచంలో సూర్యుడిగా(Pele The king) వెలుగొందాడు. తన కెరీర్ లో 1,279 గోల్స్ చేశాడు. 92 హ్యాట్రిక్ లు ఉన్నాయి.
మూడు వరల్డ్ కప్ లు, వందల కొద్దీ పతకాలు, ట్రోఫీలు ఉన్నాయి. 1974లో ప్రొఫెషనల్ ఫుట్ బాల్ నుంచి వీడ్కోలు పలికాడు. ఫుట్ బాల్ లో మూడు ప్రపంచ కప్ విజయాలలో పాల్గొన్న ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు పీలే.
మెస్మరైజింగ్ ఆట తీరుతో 20 ఏళ్ల పాటు సాకర్ ప్రేమికులను ఉర్రూతలూగించాడు. తన తరంలోనే కాదు మొత్తం ఫుట్ బాల్ చరిత్ర లోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా పేరు పొందాడు. ఆట పరంగా ఎంత చెప్పినా తక్కువే. పీలే బ్రెజిల్ కు ఓ వరంగా మారాడు.
ఆ దేశం అతడిని రారాజుగా చూసింది. గౌరవించింది కూడా. నాలుగు ప్రపంచ కప్ లకు ప్రాతినిధ్యం వహించాడు పీలే. 1958, 1962, 1970 వరల్డ్ కప్ లను దేశానికి అందించాడు.
ఫార్వర్డ్ , అటాకింగ్ మిడ్ పీల్డర్ గా పేరొందాడు. అసాధారణమైన ఆట తీరుతో ప్రత్యర్థులకు చిక్కకుండా బంతిని గోల్స్ గా మార్చడంలో సక్సెస్ అయ్యాడు.
పీలేకు ఉన్న గొప్ప అస్సెట్ ఏమిటంటే రెండు పాదాలతో బంతిని నియంత్రించడం. ఇలా చేయడం ఏ ఆటగాడికీ ఇప్పటి వరకు సాధ్య పడలేదు. ఇదే ఆయన ప్రత్యేకత. అంతే కాదు గాలిలో వస్తున్న బాల్ ను ఛాతితో అదుపు చేయడం రికార్డ్.
ప్రపంచ కప్ చరిత్రలో అత్యుత్తమ ఐదు గోల్స్ లలో పీలేకు చెందినవే ఉన్నాయంటే ఆయన ఎంత గొప్ప ఆటగాడో అర్థం చేసుకోవచ్చు. బతికినంత కాలం ఆటను ప్రేమించిన యోధుడు శాశ్వతంగా నిద్రలోకి జారుకున్నాడు.
Also Read : ఫుట్బాల్ దిగ్గజం పీలే కన్నుమూత