Sand Artist Tribute to Pele : ఒడిశా బీచ్ లో పీలేకు నివాళి
సైకత శిల్పి మానస్ కుమార్ సాహు
Sand Artist Tribute to Pele : ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం బ్రెజిల్ కు చెందిన పీలే శుక్రవారం కన్ను మూశారు. 82 ఏళ్ల వయస్సులో ఆయన తనువు చాలించారు. ఈ సందర్భంగా ఈ దిగ్గజానికి సంతాపాల సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పీలేకు నివాళులతో హోరెత్తుతోంది. ఇక ఆర్టిస్టులు సైతం తమ కుంచెలకు, సైకిత శిల్పులు చేతులకు పని పెట్టారు.
ఇందులో భాగంగా ఇవాళ ఒడిశా బీచ్ లో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. ప్రముఖ సైకత శిల్పిగా పేరొందిన మానస్ కుమార్ సాహు ఫుట్ బాల్ దిగ్గజం పీలేకు అద్భుతమైన రీతిలో నివాళి(Sand Artist Tribute to Pele) అర్పించారు. బీచ్ వద్ద ఇసుకతో పీలే సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రస్తుతం ఇది వైరల్ గా మారింది.
ఇందులో భాగంగా ఎ హీరో నెవర్ డైస్ .. లాంగ్ లివ్ పీలే అనే సందేశంతో ఫుట్ బాల్ క్రీడాకారుడికి చెందిన 15 అడుగుల వెడల్పు ఇసుకతో శిల్పాన్ని తయారు చేశాడు. ఇందుకు సంబంధించి మీడియాతో మాట్లాడాడు కళాకారుడు మానస్ కుమార్ సాహు. పీలే సైకత శిల్పాన్ని తయారు చేసేందుకు తనకు నాలుగు గంటల సమయం పట్టిందని స్పష్టం చేశాడు.
ప్రపంచ ఫుట్ బాల్ క్రీడా రంగంలో ఎన్నదగిన ఆటగాళ్లలో మొదటి ఆటగాడు ఏకైక వ్యక్తి పీలే అని పేర్కొన్నాడు. అందుకే ఈ రూపకంగా పీలేకు నివాళులు అర్పించానని తెలిపాడు సాహూ.
ఇదిలా ఉండగా కుమార్ సాహు దీనిని తయారు చేసేందుకు 10 టన్నుల ఇసుకను ఉపయోగించడం విశేషం. సాహూ చెప్పినట్లు పీలేకు మరణం లేదు.
Also Read : రాఖీ భాయ్ హార్దిక్..కృనాల్ వైరల్