Pathan Controversial Comment : ఒకప్పుడు ప్రచారం కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. అంతకంటే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉండింది. కానీ ఇప్పుడు ఆ సమస్య తప్పింది. ఎంచక్కా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక సీన్ మారింది సిట్యూయేషన్ కూడా మారింది.
ఎవరి దుకాణం వారిదే. సామాజిక మాధ్యమాలు ప్రచారానికి అస్త్రాలుగా, ఆయుధాలుగా తయారయ్యాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలకు చెందిన వారంతా వీటి మీదే ఆధారపడడం మొదలు పెట్టారు.
తక్కువ ఖర్చు ఎక్కువ ప్రచారం. కావాల్సినంత..కోరుకున్నంత ఫాలోయింగ్. క్షణాల్లోనే వైరల్..కాక పోతే హల్ చల్ ఇదే నేడు రాజ్యం ఏలుతోంది. ఇది పక్కన పెడితే..సినీ రంగం..రాజకీయ రంగం..క్రీడా..వ్యాపార రంగాలు ఒకదానికొకటి పెన వేసుకుంటూ ఉంటాయి.
ఇక ప్రత్యేకించి సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు థియేటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కావాల్సినప్పుడు చూసే వీలు కలిగాక దానికి డిమాండ్ అంతకంతకూ తగ్గుతూ వస్తోంది.
ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్లు, వాటి వెనుక ఆహా లు ఓహోలు ఉండనే ఉంటాయి. హీరో హీరోయిన్లకు ఫ్యాన్లు, ఫాలోయింగ్ లు షరా మామూలే. ఒకరిపై మరొకరి విమర్శలు, ట్వీట్లు, షేరింగ్ లు కూడా పెరిగాయి.
అవి మరీ వ్యక్తిగతంగా విమర్శలకు దిగే స్థాయికి దిగజారాయి.సినిమాలు తీయడం ఇప్పుడు శక్తికి మించి భారంగా మారింది. వ్యాపార, దిగ్గజ కార్పొరేట్ సంస్థలు రంగంలోకి దిగాక..వీటినే నమ్ముకుని తీస్తున్న నిర్మాతలకు పని లేకుండా పోయిందన్న ఆరోపణలు లేక పోలేదు.
సాంకేతికత పరంగా ఓటీటీ ప్లాట్ ఫారమ్స్ కొలువు తీరాక సినిమాలు కొద్ది రోజుల్లోనే విడుదలై..ఆ తర్వాత దర్శనం ఇస్తున్నాయి.
ఇది పక్కన పెడితే వందల కోట్ల రూపాయలతో తీసే సినిమాలకు పెట్టిన ఖర్చు రాబట్టు కోవాలంటే ఏం చేయాలి.
భారీగా ప్రచారం కావాలి. ఉన్నది ఉన్నట్లు చెబితే జనం వాటి వైపు చూసే పరిస్థితి లేదు. అందుకే కొన్ని సినిమాలు పనిగట్టుకుని ఏదో ఒక అంంశంపై కావాలని రాద్దాంతం జరిగేలా చేస్తున్నాయి.
ఒకప్పుడు విమర్శలు సినిమాలకు(Pathan Controversial) మైనస్ అయ్యేలా చేసేవి. కానీ ఇప్పుడు అవే వరంగా మారాయి. ఎంత వివాదాస్పదం (కాంట్రోవర్సీ ) అయితే అంత పాపులర్..అంతకంటే గొప్ప సక్సెస్.
సినిమా బయటకు రావాలంటే ఎన్నో తిప్పలు. వచ్చాక ఆడుతుందో లేదోనన్న గుబులు. పోనీ విడుదలయ్యాక చూస్తారంటే నమ్మకం లేదు. థియేటర్లు ఉంటాయో ఉండవోనన్న అనుమానం.
ఈ తరుణంలో ఆయా మూవీస్ కు సంబంధించి ఏదో ఒక అంశంపై వివాదం చెలరేగితే ఇక ఎవరినీ దేబరించాల్సిన పని ఉండదు. ఎంచక్కా ఖర్చు లేకుండానే ప్రచారం లభిస్తుంది.
తాజాగా ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవాల్సింది షారుఖ్ ఖాన్ , దీపికా పదుకొనే నటించిన పఠాన్ మూవీ. ఇందులో ఇద్దరూ నటించిన సాంగ్ బేషరమ్ సాంగ్ . హిందూ మనోభావాలు దెబ్బతినేలా ఉన్నాయంటూ ఆందోళనలు(Pathan Controversial) మిన్నంటాయి.
కేసులు నమోదయ్యాయి. చివరకు సెన్సార్ బోర్డు సినిమాను, సాంగ్స్ ను ప్రజలు చూసేలా చేయాలని ఆదేశించింది. ఏది ఏమైనా వివాదాస్పదమా లేక
ప్రచారమా అన్నది ఇప్పుడు తేల్చాల్సింది ప్రేక్షకులు..వీక్షకులే కదూ.
Also Read : రాఖీ భాయ్ హార్దిక్..కృనాల్ వైరల్