PM Modi Rishabh Pant : రిష‌బ్ పంత్ ఆరోగ్యంపై ప్ర‌ధాని ఆరా

మెరుగైన చికిత్స అందించాల‌ని ఆదేశం

PM Modi Rishabh Pant : భార‌త క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ ప్ర‌మాదానికి గురి కావ‌డంపై స్పందించారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. త‌న త‌ల్లి అంత్య‌క్రియ‌లు ముగిశాయి. ఇదే స‌మ‌యంలో పంత్ రోడ్డు ప్ర‌మాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఒక ర‌కంగా చావు అంచుల నుంచి త‌ప్పించుకున్నాడు.

ఢిల్లీ నుంచి ఉత్త‌రాఖండ్ కు కారులో బ‌య‌లుదేరాడు. కానీ డ్రైవ‌ర్ లేడు. తానే స్వంతంగా న‌డుపుకుంటూ వెళ్లాడు. తీరా అత్యంత వేగంతో కారును న‌డిపాడు. అది వెళ్లి డివైడ‌ర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్క‌సారిగా మంట‌లు చెలరేగాయి. ఈ ఘ‌ట‌న‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు రిష‌బ్ పంత్ .

ఘ‌ట‌నా స్థ‌లంలో ప‌డి పోయిన పంత్ ను హుటా హుటిన రూర్కీ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డ చికిత్స చేసిన అనంత‌రం మెరుగైన వైద్యం కోసం డెహ్రాడూన్ కు పంపించారు. ఇదిలా ఉండ‌గా ప్రాణాపాయ స్థితి నుంచి రిష‌బ్ పంత్ బ‌య‌ట ప‌డ్డాడ‌ని ఆస్ప‌త్రి వైద్యులు వెల్ల‌డించారు.

పంత్ కు అయ్యే వైద్య ఖ‌ర్చుల‌ను ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంద‌ని ప్ర‌క‌టంచారు ఉత్త‌రాఖండ్ ముఖ్య‌మంత్రి ధామీ. ఇదే స‌మ‌యంలో పంత్ గాయ‌ప‌డిన విష‌యం తెలుసుకున్న ప్ర‌ధాన‌మంత్రి(PM Modi) సీఎంతో మాట్లాడారు. రిష‌బ్ పంత్ త‌ల్లితో ఫోన్ లో మాట్లాడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.

రిష‌బ్ పంత్ కు జ‌రిగిన ఘ‌ట‌న‌తో తాను బాధ ప‌డ్డాన‌ని పేర్కొన్నారు ప్ర‌ధాన‌మంత్రి. త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఎలాంటి స‌హాయం అయినా చేసేందుకు సిద్దంగా ఉన్నామ‌ని హామీ ఇచ్చారు న‌రేంద్ర మోదీ.

Also Read : కోలుకుంటున్న రిష‌బ్ పంత్ – జే షా

Leave A Reply

Your Email Id will not be published!