David Warner : భారత్ లో ఆడటం అదనపు బలం
ఆసిస్ స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్
David Warner : దక్షిణాఫ్రికాకు తన అసాధారణ బ్యాటింగ్ తో చుక్కలు చూపించిన ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ డేవిడ్ వార్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మనోడికి భారత్ లో ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. వీరిలో తెలుగు వారు మరీ ఎక్కువ. భారత్ లో ఆస్ట్రేలియా పర్యటించాల్సి ఉంది.
మరో వైపు 2023లో భారత్ వేదికగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వన్డే వరల్డ్ కప్ జరగనుంది. ఇప్పటికే ఐపీఎల్ లో కీలకమైన ఆటగాడిగా ఉన్నాడు డేవిడ్ వార్నర్. తనకు పుట్టినిల్లు ఆస్ట్రేలియా అయినప్పటికీ ఎక్కువగా ఇష్టపడేది ఆడేందుకు మాత్రం భారత్ తనకు అనువైనదిగా పేర్కొన్నాడు స్టార్ ప్లేయర్.
తాను ఎప్పుడు ఫామ్ కోల్పోయినా తిరిగి సత్తా చాటేందుకు ఇండియా ఒక ప్రేరణగా నిలుస్తుందని కితాబు ఇచ్చాడు. తనకు లెక్కించ లేనంత మంది అభిమానులు కేవలం భారత్ నుంచే ఉండడం తనకు అదనపు బలాన్ని ఇస్తుందని స్పష్టం చేశాడు డేవిడ్ వార్నర్(David Warner). వచ్చే ఏడాదిలో భారత్ తో జరిగే ఆసిస్ సీరీస్ కోసం తాను వేయి కళ్లతో ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు.
మరో వైపు ఢిల్లీ క్యాపిటల్స్ వార్నర్ ను రీటైన్ చేసుకుంది ఈసారి వేలం పాటలో. మరో వైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వార్నర్ ను వదులుకుంది. ఇది క్రికెట్ అభిమానులను విస్తు పోయేలా చేసింది.
సౌతాఫ్రికాపై విజయం సాధించిన అనంతరం వార్నర్ కీలక కామెంట్స్ చేశాడు. తన వయస్సును ప్రస్తావించ వద్దని కోరాడు. తాను మరింత బాగా ఆడాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. సఫారీలపై డబుల్ సెంచరీ చేశాడు తన 100వ టెస్టులో డేవిడ్ వార్నర్.
Also Read : సర్జరీ కోసం పంత్ ఢిల్లీకి తరలింపు