Naresh Pavitra Comment : ప్రేమ మధురం అధరం ఆనందం
లేటు వయసులో ఘాటు ప్రేమ
Naresh Pavitra Comment : సినిమా రంగం కలల ప్రపంచం. అవి కదిలే బొమ్మలు. ఒక్కోసారి పాత్రలు మారినట్లే నటీనటులు కూడా మారి పోతుంటారు. పేరున్నంత వరకే ఆదరణ. లేకుండా నిరాదరణే. ఇది పక్కన పెడితే ఏ సినిమా రంగాన్ని తీసుకున్నా పెళ్లి చేసుకున్న జంటలు చాలా తక్కువ.
ఒకవేళ బంధంగా ఒక్కటైనా చివరి దాకా ఉన్నది చాలా అరుదు. తాజాగా మరోసారి హాట్ టాపిక్ గా మారారు నటుడు నరేష్. నటి పవిత్రా లోకేష్(Naresh Pavitra) . ఇద్దరికీ ఇప్పటికే పెళ్లిళ్లు అయ్యాయి. ఆమెకు పిల్లలు ఉన్నారు.
ఇంతలో కొత్త సంవత్సానికి గుర్తుగా ఓ వీడియోను విడుదల చేశారు. లేటు వయసులో లిప్ కిస్ తో అందరినీ ఆశ్చర్య పోయేలా చేశారు. దీంతో వయస్సు శరీరానికే కానీ ప్రేమకు కాదని నిరూపించారు.
ఒక రకంగా చర్చకు దారి తీశారు. ఈ ఇద్దరు బెంగళూరు హోటల్ లో పట్టుబడ్డారు. కానీ తామిద్దరం స్నేహితులమని చెప్పే ప్రయత్నం చేశారు నరేష్.
చివరకు ఇద్దరు ఒక్కటి కాబోతున్నామంటూ సంకేతం ఇచ్చారు. ఇదంతా పక్కన పెడితే పవిత్రా లోకేష్ కు 43 ఏళ్లు. నరేష్ కు 62 ఏళ్లు.
1972లో పండంటి కాపురం మూవీతో తన కెరీర్ స్టార్ట్ చేశారు. ఇద్దరికీ ఇంచు మించు 20 ఏళ్ల తేడా. ఒక రకంగా వయసు రీత్యా చూస్తే కేవలం ఆలంబన కోసం మాత్రమే అని ఇప్పటికే స్పష్టం చేశారు. ఏది ఏమైనా జీవితపు ప్రయాణంలో ఎప్పుడు ఎలా ప్రేమ పుడుతుందో చెప్పలేం.
జర్నీ అంటే కేవలం బంధం కోసం లేదా శారీరకమైన అనుబంధం కోసమో కాదు. కొంత వయస్సు వచ్చాక తోడు కావాలని అనిపిస్తుంది.
రోజు రోజుకు వయసు పెరుగుతున్న సమయంలో ఒకింత ఒంటరితనం కావాలని కోరుకుంటుంది మనసు. కానీ హృదయం కూడా తన పక్కన ఇంకొకరు ఉంటే ఇంకాస్తా భరోసా లభిస్తుందనే ఆశ కూడా కలుగుతుంది.
దీనిని ఎవరూ మార్చలేరు. ఇంకెవరూ చెరపలేరు. ఒక్క నరేష్ , పవిత్ర లోకేష్(Naresh Pavitra) లే కాదు చాలా మంది వయస్సు రీత్యా తేడా ఉన్నా ప్రేమ , అభిమానం , బంధం విషయంలో అన్ని హద్దులను దాటుకుంటూ వెళ్లారు.
ప్రతి దానిని భూతద్దంలో పెట్టి చూస్తే ప్రస్తుత ప్రపంచంలో ప్రయాణం చేయడం, నెగ్గుకు రావడం కష్టమే. ప్రేమ అనిర్వీచనీయమైన అనుభూతి ఇస్తుంది. దానికి ఎల్లలు లేవు. సరిహద్దులు అసలే లేవు.
దానికి కులం, ప్రాంతం, మతం, సరిహద్దులు, దేశాలతో సంబంధం లేదు. కొన్నింటికీ ప్రశ్నలు మాత్రమే ఉంటాయి. అవి చూపులతోనే సమాధానాలు ఇస్తాయి. అందుకే ప్రేమా కవ్వించకే మనసా రవళించకే అని పాడుకునేది. ప్రేమంటే ఏమిటంటే ప్రేమించాక తెలిసే అని కవి రాసినా ఇందుకోసమే.
గతంలో వేరు..ఇప్పుడు వేరు..కాలం మారింది..తరాలు మారాయి..సాంకేతికత..ఆధునికత తలరాతలను మార్చేస్తోంది..
ఇదే సమయంలో సంప్రదాయాలు, కట్టుబాట్లు, అభిప్రాయాలు నీటి మీద రాతల్లా చెరిగి పోతున్నాయి. నరేష్, పవిత్రల విషయంలో ఎవరికీ అభ్యంతరం ఉండక పోవచ్చు.
ఎందుకంటే వారు మేజర్లు..కానీ సభ్య సమాజానికి కూడా ఆదర్శ ప్రాయంగా ఉండాలన్నదే అందరూ కోరుకునేంది.
Also Read : ‘ధమాకా’ తఢాఖా వసూళ్లలో మజాకా