Puri Jagannadh : ఈరోజే ముఖ్యం రేపటితో అనవసరం
దర్శకుడు పూరీ జగన్నాథ్ మ్యూజింగ్స్
Puri Jagannadh : ఆర్జీవీ ఫ్యాక్టరీలోంచి వచ్చిన దర్శకులలో ఒకడు పూరీ జగన్నాథ్. పడి లేచిన కెరటం తను. మోస్ట్ పాపులర్ డైరెక్టర్ గా పేరొందినా జీవితాన్ని తను చూసే కోణం వేరు. అందుకే పూరీ అంటే చాలా మందికి ప్రేమ. ఆయన తీసే సినిమాలు భిన్నంగా ఉంటాయి. అంతకు మించి డైలాగులు కూడా ఆకట్టుకునేలా, హృదయాన్ని నేరుగా తాకుతాయి. పూరీ జగన్నాథ్ అంటేనే ముందుగా గుర్తుకు వచ్చేది పోకిరి. చాలా సినిమాలు తీశాడు. ఇంకా తీస్తూనే ఉన్నాడు.
గెలుపు ఓటముల గురించి ఎక్కువగా పట్టించుకోడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) . ఒక రకంగా చెప్పాలంటే నాకో తిక్కుంది దానికో లెక్కుంది అన్నట్టుగా ఉంటుంది రామ్ గోపాల్ వర్మ శిష్యుల్లో. ఎక్కువగా పుస్తకాలు చదువుతాడు. అద్భుతంగా రాస్తాడు. అతడి డైలాగ్ లు నేటికీ హల్ చల్ చేస్తున్నాయి. లైఫ్ లో ఆనందం పొందాలంటే ఏ రోజుకు ఆరోజే బతకాలని పేర్కొన్నాడు.
కొత్త సంవత్సరం సందర్భంగా వెరైటీగా ట్వీట్ చేశాడు పూరీ జగన్నాథ్. పూరీ మ్యూజింగ్స్ పేరుతో ఆయన డిఫరెంట్ గా స్పందించాడు. రేపటి కోసం ఆలోచిస్తే ఉన్న విలువైన కాలాన్ని కోల్పోతామని పేర్కొన్నాడు దర్శకుడు. ఈ క్షణమే ముఖ్యమని, దీనిని గుర్తిస్తే అనుకున్న వాటిని సులభంగా సాధించవచ్చని సూచించాడు పూరీ జగన్నాథ్(Puri Jagannadh) .
రేపటిలో ఆనందాన్ని వెతుక్కుంటూ బతకడం తప్పేనని అభిప్రాయపడ్డారు. అందుకే ఇవాళే ముఖ్యమని స్పష్టం చేశాడు పూరీ జగన్నాథ్. ప్రతి ఒక్కరూ విజేతగా జన్మించరు. కానీ కష్టపడితే ఎవరైనా సక్సెస్ కావచ్చని పేర్కొన్నాడు. ఇబ్బందులు, కష్టాలు అనేవి సహజం. వాటి గురించి ఆలోచిస్తే విలువైన కాలాన్ని కోల్పోతామని హెచ్చరించాడు డైరెక్టర్.
Also Read : ‘ధమాకా’ తఢాఖా వసూళ్లలో మజాకా