BCCI Announces 2023 Schedule : బీసీసీఐ 2023 షెడ్యూల్ రిలీజ్

న్యూ ఇయ‌ర్ లో ఫుల్ బిజీ

BCCI Announces 2023 Schedule : గ‌త ఏడాది 2022 మిశ్ర‌మ ఫ‌లితాలు మిగిల్చింది భార‌త జ‌ట్టు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కొత్త సంవ‌త్స‌రం 2023ను పుర‌స్క‌రించుకుని క్రికెట్ అభిమానుల‌కు గ్రీటింగ్స్ తెలిపింది.

ఇదే స‌మ‌యంలో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త జ‌ట్టు ఆడే మ్యాచ్ లు, టోర్నీలకు సంబంధించి ఈ ఏడాదికి గాను షెడ్యూల్(BCCI Announces 2023 Schedule)  విడుద‌ల చేసింది.

మొద‌ట‌గా శ్రీ‌లంక జ‌ట్టుతో భార‌త్ ఆట మొద‌ల‌వుతుంది. శ్రీ‌లంక‌తో స్వ‌దేశంలో టీ20 , వ‌న్డే సీరీస్ లు ఆడ‌నుంది. జ‌న‌వ‌రి 3న మొద‌టి టీ20 మ్యాచ్ ముంబైలో జ‌రుగుతుంది. రెండో టీ20 మ్యాచ్ జ‌న‌వ‌రి 5న ముంబైలో కొన‌సాగుతుంది.

జ‌న‌వ‌రి 7న రాజ్ కోట్ లో టీ20 మ్యాచ్ జ‌రుగుతుంది. ఇక వ‌న్డే సీరీస్ లో భాగంగా మొద‌టి మ్యాచ్ జ‌న‌వ‌రి 10న‌, 2వ వ‌న్డే 12న‌, మూడో వ‌న్డే 15న తిరువ‌నంత‌పురంలో జ‌రుగుతుంది.

భార‌త్ లో న్యూజిలాండ్ ప‌ర్య‌టిస్తుంది. తొలి వ‌న్డే జ‌న‌వ‌రి 18న‌, రెండో వ‌న్డే 21న‌, మూడో వ‌న్డే జ‌న‌వ‌రి 24న జ‌రుగుతుంది. టీ20 సీరీస్ లో భాగంగా జ‌న‌వ‌రి 27న తొలి టీ20 మ్యాచ్ జ‌రుగుతుంది.

రెండో టీ20 మ్యాచ్ జ‌న‌వ‌రి 29న , మూడో టీ20 మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 1న అహ్మ‌దాబాద్ లో కొన‌సాగుతుంది. ఆస్ట్రేలియా ఇండియాలో ప‌ర్య‌టిస్తుంది. తొలి టెస్టు మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 9 నుంచి 13 దాకా జ‌రుగుతుంది. 

రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్ర‌వ‌రి 17 నుంచి 21 దాకా కొన‌సాగుతుండ‌గా 3వ టెస్ట్ మార్చి 1 నుంచి 5వ తేదీ దాకా జరుగుతుంది. వ‌న్డే సీరీస్ లో భాగంగా తొలి వ‌న్డే మ్యాచ్ మార్చి 17న‌, రెండో వ‌న్డే మార్చి 19న , 3వ వ‌న్డే మార్చి 23న ఆడుతుంది. 

జూలైలో భార‌త జ‌ట్టు వెస్టిండీస్ లో ప‌ర్య‌టిస్తుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టీ20 మ్యాచ్ ల సీరీస్ లు ఆడ‌నుంది.

 వీటికి సంబంధించి ఇంకా డేట్స్ డిక్లేర్ చేయ‌లేదు. ఇక ఆస్ట్రేలియా మ‌రోసారి సెప్టెంబ‌ర్ లో భార‌త్ కు రానుంది. మూడు మ్యాచ్ ల వ‌న్డే సీరీస్ ఆడుతుంది. న‌వంబ‌ర్ లో తిరిగి వ‌స్తుంది ఇండియాకు 

ఆసిస్. ఐదు మ్యాచ్ ల టీ20 సీరీస్ ఆడ‌నుంది. వీటికి సంబంధించి ఇంకా తేదీలు ఖ‌రారు చేయ‌లేదు బీసీసీఐ. అక్టోబ‌ర్ లో ఐసీసీ ఆసియా క‌ప్ పాకిస్తాన్ లో జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త జ‌ట్టు పాకిస్తాన్ లో ఆడ‌బోదంటూ ప్ర‌క‌టించింది బీసీసీఐ. భ‌ద్ర‌తా కార‌ణాల రీత్యా వెళ్ల‌డం లేదంటూ వెల్ల‌డించింది.

ఒక‌వేళ త‌ట‌స్థ వేదిక‌ల‌పై ఆడేందుకు సిద్ద‌మ‌ని ప్ర‌క‌టించింది. దీనికి ఐసీసీ నుంచి అనుమ‌తి రావాల్సి ఉంది. ఇక భార‌త్ లో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. మ‌రో వైపు టెస్ట్ ఛాంపియ‌న్ షిప్ ఫైన‌ల్ రేసులో భార‌త్ ఉంది. వెళుతుందా లేదా అన్న‌ది ఇత‌ర జ‌ట్ల గెలుపు ఓట‌ముల‌పై ఆధార‌ప‌డి ఉంది. 

ఇక 2023 లో చివ‌ర‌గా భార‌త జ‌ట్టు ద‌క్షిణాఫ్రికాలో ప‌ర్య‌టిస్తుంది. ఇది డిసెంబ‌ర్ లో టూర్ ప‌ర్య‌ట‌న ఉండ‌నుంది. ఇందులో భాగంగా రెండు టెస్టులు, మూడు వ‌న్డేలు, మూడు టెస్టు మ్యాచ్ ల సీరీస్ ఆడుతుంది.

Also Read : రోడ్డు ప్ర‌మాదం ‘పంత్’ ఆట‌కు దూరం

Leave A Reply

Your Email Id will not be published!