Elon Musk : కొత్త సంవత్సరంలో మస్క్ కు షాక్
ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఎస్లా బాస్
Elon Musk : గత ఏడాది 2022 తీవ్ర నిరాశకు గురి చేసింది టెస్లా చైర్మన్ , ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ ను. ప్రపంచ కుబేరుల్లో టాప్ లో ఉంటూ వచ్చాడు. విచిత్రం ఏమిటంటే ఈసారి ఊహించని రీతిలో $200 బిలియన్లను కోల్పోయాడు. భారీ ఎత్తున నష్టం వాటిల్లింది. రూ. 4,400 కోట్ల భారీ ధరకు మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ ను కొనుగోలు చేశాడు.
భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టాడు. ఎప్పుడైతే ట్విట్టర్ ను కొనుగోలు చేశాడో ఆనాటి నుంచి తన మాతృ సంస్థ టెస్లా కంపెనీ షేర్లు దారుణంగా దెబ్బ తిన్నాయి. ఏకంగా ఎలోన్ మస్క్(Elon Musk) తన సంపద ను రూ. $137 బిలియన్లకు పడి పోయింది. అమెజాన్ చీఫ్ జెఫ్ బెజోస్ జనవరి 2021లో అధిగమించాడు.
$200 బిలియన్ల కంటే ఎక్కువ వ్యక్తిగత సంపదను సంపాదించిన రెండో వ్యక్తిగా ఎలోన్ మస్క్ నిలిచాడు. ప్రస్తుతం టెస్లా ఎలక్ట్రిక్ విద్యుత్ కార్ల సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నారు. నికర విలువలో గణనీయంగా తగ్గింది ఆదాయం. బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ వెల్లడించిన ప్రకారం 51 ఏళ్ల మస్క్ తన సంపదను కోల్పోయారు.
నవంబర్ 4 2021న ఎలోన్ మస్క్ సంపద $340 బలియన్లకు చేరుకుంది. లగ్జరీ గూడ్స్ పవర్ హౌస్ ఎల్వీఎంహెచ్ ఓనర్ అయిన ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్డ్ అతన్ని అధిగమించే వరకు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు. టెస్లా అక్టోబర్ 2021లో మొదటిసారిగా $1 ట్రిలియన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ను అధిగమించింది. కొత్త సంవత్సరంలో కొంత మేరకైనా కోల్పోయిన డబ్బులను సంపాదిస్తాడా అన్నది వేచి చూడాలి.
Also Read : న్యూ ఇయర్ లో సరికొత్తగా ట్విట్టర్