BCCI Announces Best Players : బీసీసీఐ ఉత్తమ క్రికెటర్ల ఎంపిక
టెస్టుల్లో పంత్.. బుమ్రా టాప్
BCCI Announces Best Players : భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ప్రతి ఏటా ఉత్తమ క్రికెటర్లను ఎంపిక చేయడం ఆనవాయితీగా వస్తోంది. గడిచిన ఏడాది 2022లో మూడు ఫార్మాట్ లైన టీ20, వన్డే, టెస్టు లలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ప్లేయర్లను ఎంపిక(BCCI Announces Best Players) చేసింది. ఈ మేరకు జాబితాను ప్రకటించింది. బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో ఎవరు టాప్ ఉన్నారనే దాని ఆధారంగా విడుదల చేసింది.
టెస్టు క్రికెట్ పరంగ చూస్తే తీవ్ర విమర్శలు ఎదుర్కొని, ఇటీవలే రూర్కీ వద్ద యాక్సిడెంట్ కు గురైన రిషబ్ పంత్ టాప్ లో నిలిచాడు బ్యాటింగ్ విభాగంలో. 2022లో మొత్తం 7 టెస్టులు ఆడాడు. ఇందులో 680 పరుగులు ఉన్నాయి. వాటిలో రెండు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం.
ఈ ఏడాది గాయం కారణంగా ఆటకు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే సర్జరీ చేయాల్సి ఉందని వైద్యులు ప్రకటించారు. ఇక బౌలింగ్ విభాగంలో టాప్ లో నిలిచాడు స్పీడ్ స్టర్ గా పేరొందిన బుమ్రా. ఏడాదిలో ఐదు టెస్టులో 20.31 సగటుతో 22 వికెట్లు తీశాడు. రెండు సార్లు ఐదు వికెట్లు పడగొట్టడం విశేషం.
ఇక వన్డే ఫార్మాట్ పరంగా చూస్తే బ్యాటింగ్ లో శ్రేయస్ అయ్యర్ టాప్ లో ఉన్నాడు. 17 మ్యాచ్ లు ఆడి 724 రన్స్ చేశాడు. ఆరు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక బౌలింగ్ లో హైదరాబాద్ పేసర్ సిరాజ్ టాప్ లో నిలిచాడు. 15 మ్యాచ్ లు ఆడి 24 వికెట్లు తీశాడు. మరో వైపు టీ20 ఫార్మాట్ లో బ్యాటింగ్ లో సూర్య కుమార్ యాదవ్ నెంబర్ 1గా నిలిచాడు.
31 మ్యాచ్ లు ఆడి 1,164 రన్స్ చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 9 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ లో టాప్ లో నిలిచాడు . 32 టీ20 మ్యాచ్ లు ఆడాడు 37 వికెట్లు తీశాడు.
Also Read : ఐసీసీ ర్యాంకింగ్స్ లో బాబర్ టాప్