Sandeep Singh Row : హాకీ దిగ్గజం ఆరోపణల పర్వం
ఎవరీ సందీప్ సింగ్ ఏమిటా కథ
Sandeep Singh Row : ఎవరీ సందీప్ సింగ్ అనుకుంటున్నారా. లైంగిక వేధింపుల కారణంగా తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది అనూహ్యంగా చోటు చేసుకుంది. ఒక రకంగా కొత్త సంవత్సరం ఆయనకు అచ్చి రాలేదు. హాకీ మహిళా కోచ్ పట్ల అసభ్యంగా వ్యవహరించాడని, 2016 నుంచి ఇన్ స్టా గ్రామ్ లో వేధిస్తూ వచ్చాడని, చివరకు లొంగక పోతే తనను బదిలీ చేయించాడంటూ సదరు మహిళా కోచ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీకి చెందిన మంత్రి. ఇదే సమయంలో తనపై కావాలని ఇరికించేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని , తాను ఏ విచారణను ఎదుర్కొనేందుకైనా సిద్దంగా ఉన్నానని ప్రకటించాడు సందీప్ సింగ్. ఆయనపై ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
అంతే కాకుండా విచారణకు సంబంధించి డైరెక్టర్ జనరల్ నేతృత్వంలో ఓ కమిటీని కూడా ఏర్పాటు చేసింది సర్కార్. మంత్రిగా కాక ముందు సందీప్ సింగ్ హాకీ క్రీడా రంగంలో లెజెండ్ గా పేరొందాడు. భార త జట్టుకు నాయకుడిగా వ్యవహరించాడు. తనపై విమర్శలు అబద్దమని పేర్కొన్నాడు మంత్రి.
తాను ఏమిటో నిరూపించుకునేందుకే తన మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించాడు సందీప్ సింగ్. ఇక ఆయన హాకీ పరంగా పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ గా గుర్తింపు పొందాడు. దీంతో ఆయనకు ఫ్లిక్కర్ సింగ్ అని పేరు వచ్చింది. ఇదిలా ఉండగా 20 ఏళ్ల వయస్సులో సందీప్ సింగ్ ప్రపంచ కప్ ఆడే కంటే రెండు రోజుల ముందు ఢిల్లీకి వెళ్లే రైలులో కాల్పులకు గురయ్యాడు.
ఒక ఏడాది పాటు పక్షవాతానికి గురయ్యాడు. ఆ తర్వాత కోలుకున్నాడు. భారత జట్టులో తిరిగి స్థానం పొందాడు. సుల్తాన్ అజ్ఞాన్ షా కప్ 2008, 2009 లలో టాప్ స్కోరర్ గా నిలిచాడు సందీప్ సింగ్(Sandeep Singh). చివరలో భారత్ స్వర్ణం గెలుచుకుంది. అంతే కాదు ప్రముఖ సింగర్ దిల్జిత్ దోసాంజ్ ప్రధాన పాత్రలో సందీప్ సింగ్ జీవితం ఆధారంగా 2018లో సూర్య అనే సినిమా విడుదలైంది.
అంతే కాదు ఎంటీవీ రోడీస్ లో న్యాయ నిర్ణేతగా కూడా కనిపించాడు. 2019లో రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పెహోవా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. స్పోర్ట్స్ మినిష్టర్ గా ఉన్నాడు. మొత్తంగా సందీప్ సింగ్ ఆటలో విజేతగా నిలిచినా ఆరోపణల పర్వంలో చిక్కుకోవడం విస్తు పోయేలా చేసింది.
Also Read : హర్యానా మంత్రి సింగ్ రాజీనామా