Assembly Polls 2023 : సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్
ఎనిమిది రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు
Assembly Polls 2023 : కొత్త ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ప్రారంభం కానుంది. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ , గుజరాత్ రాష్ట్రాలలో ఎన్నికలు ముగిశాయి. గుజరాత్ లో రికార్డ్ బ్రేక్ చేసింది భారతీయ జనతా పార్టీ. ఇక హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ అనూహ్యంగా పవర్ లోకి వచ్చింది. కాషాయానికి కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఇదిలా ఉండగా 2023లో ఏకంగా అయిదు రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు(Assembly Polls 2023) జరగనున్నాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. దీంతో ఈ కొత్త సంవత్సరం చివరలో దేశంలోని కర్ణాటక, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ , తెలంగాణ , ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో ఇప్పటి వరకు ఈ రాష్ట్రాలలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ పవర్ లో ఉంది. ఇక తెలంగాణలో భారత రాష్ట్ర సమితి కొలువు తీరగా చత్తీస్ గఢ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆయా రాష్ట్రాలలో జరిగే అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి.
వీటిలో వచ్చే ఫలితాలను ఆధారంగా చేసుకుని సార్వత్రిక ఎన్నికలలో ఎలా ఫలితాలు ఉంటాయోనని పార్టీలు అంచనా వేస్తున్నాయి. మొత్తంగా బీజేపీ వీటిని సెమీ ఫైనల్ గా భావిస్తున్నాయి. ఆ ఐదు రాష్ట్రాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్ , త్రిపుర, మేఘాలయలలో మొదటగా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
త్రిపురలో బీజేపీ ఉండగా నాగాలాండ్ లో ఎన్డీపీ పవర్ లో ఉంది. మేఘాలయలో కాషాయ పార్టీ అధికారంలో ఉంది. నేషనల్ పీపుల్స్ పార్టీ ఈశాన్య రాష్ట్రాల నుండి గుర్తింపు పొందిన ఏకైక పార్టీ. 224 మంది సభ్యులు కలిగిన కర్ణాటక అసెంబ్లీ పదవీ కాలం మే24తో ముగుస్తుంది. ఇప్పటికే బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది.
ఏప్రిల్ చివరలో కానీ లేదా మే నెలలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ బీజేపీ ఎదురీదుతోంది. ఇక కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో కొనసాగుతోంది. మధ్య ప్రదేశ్ లో కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా మారింది. ఛత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ హవాను తట్టుకునేందుకు బీజేపీ యత్నిస్తోంది.
రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరును తమకు అనుకూలంగా మల్చు కోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ , బీజేపీ ఎదుగుతున్నాయి. మొత్తంగా ఎనిమిది రాష్ట్రాలలో వచ్చే ఫలితాలు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు బలాన్ని ఇవ్వబోతున్నాయి.
Also Read : కన్నడ నాట మళ్లీ మాదే రాజ్యం