IND vs SL 1st T20 : శ్రీలంక రాణిస్తుందా భారత్ గెలుస్తుందా
కొత్త సంవత్సరంలో తొలి టీ20కి రెడీ
IND vs SL 1st T20 : కొత్త సంవత్సరానికి సంబంధించి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇప్పటికే క్రికెట్ షెడ్యూల్ ను ప్రకటించింది. తొలిసారిగా శ్రీలంకతో భారత జట్టు మూడు టీ20 మ్యాచ్ లు, మూడు వన్డే మ్యాచ్ ల సీరీస్ ఆడనుంది. గత ఏడాది 2022లో టీమ్ ఇండియా మిశ్రమ ఫలితాలను సాధించింది.
ఆశించిన మేర రాణించలేక పోయింది. ఇక ప్రధాన ఆటగాళ్ల ఎంపికలో సెలెక్టర్లు వివక్ష ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా కేరళ స్టార్ సంజూ శాంసన్ ను కావాలని పక్కన పెట్టడం, రిషబ్ పంత్ ను అందలం ఎక్కించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ తరుణంలో బీసీసీఐ తాజాగా ప్రకటించిన టీమ్ లో కేవలం శాంసన్ ను టీ20కే పరిమితం చేశారు.
కానీ వన్డే సీరీస్ కు పక్కన పెట్టడం చర్చకు దారి తీసింది. ఇదిలా ఉండగా హార్దిక్ పాండ్యా సారథ్యంలోని భారత జట్టు జనవరి 3న మంగళవారం ముంబై లోని వాంఖడే స్టేడియంలో తొలి టీ20(IND vs SL 1st T20) మ్యాచ్ ఆడనుంది. అటు శ్రీలంకకు ఇటు భారత్ కు ఈ సీరీస్ కీలకం కానుంది. ఈ ఏడాది భారత్ ఆధ్వర్యంలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ జరగనుంది.
భారత జట్టులో శుభ్ మన్ గిల్ , సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్ , సూర్య కుమార్ యాదవ్ , దీపక్ హూడా , హార్దిక్ పాండ్యా (కెప్టెన్ ) , వాషింగ్టన్ సుందర్ , హర్షల్ పటేల్ , యుజ్వేంద్ర చాహల్ , అర్ష్ దీప్ సింగ్ , ఉమ్రాన్ మాలిక్ ఆడనున్నారు.
శ్రీలంక జట్టులో కుశాల్ మెండీస్ , పాతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో , చరిత్ అస్లంక, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్ ) , వనిందు హసరంగా , చమిక కరుణరత్నే, మహేష్ తీక్షణ, లహిరు కుమార, దిల్షన్ మధుశంక ఉన్నారు.
Also Read : సంజూ శాంసన్ కు ఛాన్స్ ఇస్తారా