Kamal Haasan Rahul : ద్వేషం దేశానికి ప్ర‌మాదం – క‌మ‌ల్ హాస‌న్

రాహుల్ గాంధీ పాద‌యాత్ర‌కు కితాబు

Kamal Haasan Rahul : ప్ర‌ముఖ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ అగ్ర నాయ‌కుడు రాహుల్ గాంధీ చేప‌ట్టిన భార‌త్ జోడో యాత్ర అద్భుత‌మ‌ని పేర్కొన్నారు. ఆయ‌న ఇప్ప‌టికే ఢిల్లీలో రాహుల్ తో క‌లిసి న‌డిచారు. రెడ్ ఫోర్డ్ వేదిక‌గా ప్ర‌సంగించారు. తాను ఒక భార‌తీయ పౌరుడిగా పాల్గొన్నాన‌ని స్ప‌ష్టం చేశారు.

తాజాగా కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. యాత్ర‌లో పాల్గొన్న వారం రోజుల త‌ర్వాత ఇవాళ స్పందించారు క‌మ‌ల్ హాస‌న్. రాహుల్ గాంధీ తాను అనేక విష‌యాలు చర్చించాన‌ని తెలిపారు. యాత్ర‌లో త‌న‌ను పాల్గొనేలా చేసినందుకు ఎంపీకి ధ‌న్య‌వాదాలు తెలిపారు.

ఇవాళ ఏం జ‌రుగుతుందో దాని గురించి మాట్లాడ‌టం క‌ర్త‌వ్యంగా భావించాన‌ని పేర్కొన్నారు. మీరు చెమ‌ట‌, ర‌క్తంతో న‌డుస్తున్నారు. మీ స‌ర్కిల్ ద్వారా చ‌రిత్ర ప్ర‌స్తావించ‌డాన్ని మీరు చూశార‌ని తెలిపారు. నాలుగు ఏళ్ల త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌స్థానం తీసుకున్న 68 ఏళ్ల లోక నాయ‌కుడు స్పందించడం చ‌ర్చ‌కు దారితీసింది.

ఆయ‌న ప్ర‌త్యేకంగా ఆనాటి ప్ర‌ధాన‌మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ నుంచి నేటి రాహుల్ గాంధీ దాకా ప్ర‌స్తావించారు. త‌మిళ‌నాడుతో ముడిప‌డి ఉన్న భాషా ఛావినిజం భావ‌న‌ను ధిక్క‌రిస్తూ వ‌చ్చారు క‌మ‌ల్ హాస‌న్(Kamal Haasan). అంద‌రి లాగే ఎవ‌రి భాష‌ల‌ను వారు గౌర‌వించు కోవాలి. మ‌తం లేని దైవ‌భ‌క్తి లేని ప్ర‌జ‌లు కూడా త‌మిళాన్ని జ‌రుపుకుంటార‌ని ఈ సంద‌ర్భంగా వెల్ల‌డించారు.

ఇదిలా ఉండ‌గా గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 6 నుంచి ప్రారంభించిన రాహుల్ గాంధీ భార‌త్ జోడో యాత్ర‌కు మ‌ద్ద‌తు తెలిపిన వారిలో క‌మ‌ల్ హాస‌న్ ఒక‌డిగా ఉన్నారు.

Also Read : భారీగా పెరిగిన నిరుద్యోగ రేటు

Leave A Reply

Your Email Id will not be published!