Pant Sand Sculpture : పంత్ కోలుకోవాలంటూ సైకత శిల్పం
రూపొందించిన పట్నాయక్
Pant Sand Sculpture : ఈ దేశంలో క్రికెటర్లకు ఉన్నంత ప్రయారిటీ ఇంకెవరికీ ఉండదు. ఇక్కడ క్రికెట్ ఓ మతం కంటే ఎక్కువ అని చెప్పక తప్పదు. కులాలు, మతాలకు అతీతంగా ఆరాధించే ఏకైక ఆట క్రికెట్. అందుకే దానికంతటి ఆదరణ. ఇదిలా ఉండగా భారత క్రికెట్ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న రిషబ్ పంత్ ఉన్నట్టుండి రహదారి ప్రమాదానికి గురయ్యాడు.
ఢిల్లీ నుంచి రూర్కీకు వెళుతుండగా కారు డివైడర్ ను ఢీకొట్టింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. వెంటనే అందులోంచి దూకేందుకు యత్నిస్తుండగా అటు వైపు నుంచి వస్తున్న హర్యానా రోడ్ ట్రాన్స్ పోర్టుకు చెందిన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్, కండక్టర్ లు రక్షించారు.
వెంటనే రిషబ్ పంత్ గాయపడిన విషయం గురించి అంబులెన్స్ కు ఫోన్ చేశారు. ఆ వెంటనే రూర్కీకి తరలించారు. దీంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటికే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేసి ఆరోగ్యం గురించి ఆరా తీశారు.
ఇదే సమయంలో పంత్ కు కావాల్సిన మొత్తం ఖర్చు తామే భరిస్తామని ప్రకటించారు ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ. ఆయన ఏకంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉండగా ప్రముఖ సైకత శిల్పిగా పేరొందిన సుదర్శన్ పట్నాయక్ ఒడిశా బీచ్ వద్ద రిషబ్ పంత్ త్వరగా కోలుకోవాలని కోరుతూ సైకత శిల్పాన్ని(Pant Sand Sculpture) తయారు చేశాడు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.
Also Read : కోలుకుంటున్న రిషబ్ పంత్ – డీడీసీఏ