Gunjan Patidar : జొమాటో కో ఫౌండర్ గుంజన్ గుడ్ బై
బిగ్ షాక్ ఇచ్చిన పాటిదార్
Gunjan Patidar : ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ రంగంలో టాప్ లో కొనసాగుతున్న జొమాటా సంస్థకు కోలుకోలేని షాక్ తగిలింది. జొమాటాను స్థాపించిన కో ఫౌండర్ గుంజన్ పాటిదార్(Gunjan Patidar) ఊహించని రీతిలో తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తాను రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించాడు. ప్రస్తుతం గుంజన్ పాటిదార్ జొమాటోలో చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ గా పని చేస్తున్నారు.
కంపెనీని పైకి తీసుకు వెళ్లడంలో కీలక పాత్ర పోషించారు. టాప్ ఉద్యోగులలో ఒకడిగా ఉన్నాడు. కంపెనీ కోసం కోర్ టెక్ సిస్టమ్ లను నిర్మించడంలో సక్సెస్ అయ్యాడు. జొమాటో కు సంబంధించి ప్రారంభమైన కొద్ది మంది ఉద్యోగులలో గుంజన్ పాటిదార్ ఒకరు. గత పది సంవత్సరాలుగా గుంజన్ టెక్ ఫంక్షన్ ను ముందుకు తీసుకు వెళ్లే సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు.
లీడర్ షిప్ టీమ్ ను కూడా పెంచేలా చేయడంలో సక్సెస్ అయ్యాడు గుంజన్ పాటిదార్. ఇదిలా ఉండగా గుంజన్(Gunjan Patidar) జొమాటోను నిర్మించడంలో సహకారం అమూల్యమైనదని పేర్కొంది కంపెనీ. ఇదిలా ఉండగా తన రాజీనామా చేసేందుకు గల కారణాలను మాత్రం వెల్లడించలేదు.
మరో వైపు గత ఏడాది 2022 నవంబర్ లో జొమాటోకు చెందిన మరో కో ఫౌండర్ మోహిత్ గుప్తా రాజీనామా చేశారు. నాలుగున్నర ఏళ్ల కిందట జొమాటో కంపెనీలో చేరిన గుప్తా 2020లో ఫుడ్ డెలివరీ బిజినెస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవి నుంచి సహ వ్యవస్థాపకుడిగా ఎలివేట్ అయ్యారు. ప్రస్తుతం రాహుల్ గంజూ , ఇంటర్ సిటీ మాజీ వైస్ ప్రెసిడెంట్ , హెడ్ సిద్దార్త్ ఝువార్ , గౌరవ్ గుప్తా ఉన్నారు.
Also Read : రద్దు తర్వాత పెరిగిన నోట్ల చలామణి