Lata Mangeshkar Top 200 : వ‌ర‌ల్డ్ ఆల్ టైమ్ సింగ‌ర్స్ ల‌లో ల‌తా

పాకిస్తాన్ దివంగ‌త గాయ‌కుడు ఫ‌తే అలీ ఖాన్

Lata Mangeshkar Top 200 : ప్ర‌పంచ వ్యాప్తంగా పేరొందిన 200 మంది గాయ‌కుల‌లో చోటు సంపాదించారు భార‌త దేశానికి చెందిన దివంగ‌త గాయ‌ని ల‌తా మంగేష్క‌ర్. ఆమెతో పాటు పాకిస్తాన్ కు చెందిన దివంగ‌త గాయ‌కుడు నుస్ర‌త్ ఫ‌తే అలీ ఖాన్ కూడా ఉన్నారు. ఈ మేర‌కు రోలింగ్ స్టోన్ జాబితాను ప్ర‌క‌టించింది. ఆల్ టైమ్ గాయ‌కుల లిస్టులో 84వ స్థానంలో నిలిచింది ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar).

దక్షిణ కొరియా కు చెంది లీజియున్ కూడా చోటు సంపాదించింది. అత్యంత చిన్న వ‌య‌సులోనే సింగ‌ర్ గా ఉన్న జంగ్ కూక్ కూడా ఈ జాబితాలో నిలిచాడు. ఇక టాప్ 20 మంది క‌ళాకారుల‌లో అరేతా ఫ్రాంక్లిన్ , విట్నీ హ్యూస్ట‌న్ , సామ్ కుక్ , బిల్లీ హాలిడే , మ‌రియా కారీ, రే చార్లెస్ , స్టీవ్ వండ‌ర్స్ , బెయాన్స్ , ఓటిస్ రెడింగ్ , ఆల్ గ్రీన్ , లిటిల్ రిచ‌ర్డ్ , జాన్ లెన్నాన్ , పాట్సీ క్లైన్ , ఫ్రెడ్డీ మెర్కురీ, బాడ్ డిలాన్ , ప్రిన్స్ , ఎల్విస్ ప్రెస్లీ , సెలియా క్ర‌జ్ , ఫ్రాంక్ సినాట్రా, మార్విన్ గ‌యే ఉన్నారు.

ఇత‌ర ప్ర‌సిద్ద గాయకుల‌లో అడెలె , పాల్ మాక్ కార్డ్నీ , డేవిడ్ బౌవీ, లూయిస్ ఆర్మ్ స్ట్రాంగ్ , అరియానా గ్రాండే , లేడీ గాగా , రిహ‌న్న , అమీ వైన్ హౌస్ , మైఖేల్ జాక్స‌న్ , నుస్ర‌త్ ఫ‌తే అలీ ఖాన్ , బాబ్ మార్లే , ఎల్డ‌న్ జాన్ , టేల‌ర్ స్విఫ్ట్ , ఓజీ ఓస్బోర్న్ , నీల్ యంగ్ , ఐయూ , బోనో , క్రిస్టినా అగ్విలేరా , బార్బ్రా స్ట్రీసాండ్ , జంగ్ కూక్ , బిల్లీ ఎల్లిస్ ఉన్నారు.

ఇదిలా ఉండ‌గా ల‌తా మంగేష్క‌ర్(Lata Mangeshkar) ఫిబ్ర‌వ‌రి 2022 లో 92 ఏళ్ల వ‌య‌స్సులో మ‌ర‌ణించారు. 36 భాష‌ల‌లో పాట‌లు పాడారు. దాదా సాహెబ్ ఫాల్కే తో పాటు భార‌త ర‌త్న అవార్డు పొందారు.

Also Read : ప‌ఠాన్ పై కామెంట్స్ వివేక్ కు వార్నింగ్

Leave A Reply

Your Email Id will not be published!