Kapil Dev Pant : పంత్.. డ్రైవ‌ర్ ను పెట్టుకోక పోతే ఎలా – కపిల్

రిష‌బ్ పంత్ పై సీరియ‌స్ కామెంట్స్

Kapil Dev Pant : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ , హ‌ర్యానా హ‌రికేన్ క‌పిల్ దేవ్ నిఖంజ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. భార‌త క్రికెట‌ర్ రిష‌బ్ పంత్ రోడ్డు ప్ర‌మాదంలో గాయ‌ప‌డ‌డంపై విచారం వ్య‌క్తం చేస్తూనే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం క‌పిల్ దేవ్ చేసిన ఈ కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

ఇక నుంచైనా రిష‌బ్ పంత్ ను చూసైనా మిగ‌తా భార‌త క్రికెట‌ర్లు ఆలోచించు కోవాలి. స్వంతంగా డ్రైవ‌ర్ల‌ను పెట్టుకునేందుకు ప్ర‌య‌త్నం చేయాలి. కోట్ల రూపాయ‌లు పంత్ కు వ‌స్తుండ‌గా త‌నంత‌కు తానుగా డ్రైవింగ్ చేసుకుంటూ పోవ‌డం ఏమిటంటూ ప్ర‌శ్నించాడు క‌పిల్ దేవ్. పంత్ ఇప్ప‌టికే టాప్ క్లాస్ ప్లేయర్ల జాబితాలో ఉన్నాడు.

బీసీసీఐ ప్ర‌తి నెలా, ప్ర‌తి ఏటా పెద్ద మొత్తంలో వేత‌నం కింద చెల్లిస్తుంది. ఆ మాత్రం డ్రైవ‌ర్ ను పెట్టుకోక పోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నాడు. ఇక‌నుంచైనా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచించాడు క‌పిల్ దేవ్(Kapil Dev Pant). స్వంతంగా డ్రైవింగ్ చేయాల‌ని కోరిక ఉండ‌వ‌చ్చు. కానీ మ‌రీ ఇంత స్పీడ్ గా వెళ్లాల‌ని అనుకోవ‌డం త‌ప్పు అని పేర్కొన్నాడు.

హ‌ర్యానా రోడ్డు ట్రాన్స్ పోర్టుకు చెందిన డ్రైవ‌ర్ , కండ‌క్ట‌ర్ గ‌నుక కాపాడ‌క పోయి ఉండి ఉంటే చాలా రిస్క్ లో ప‌డి ఉండేవాడ‌ని అన్నారు క‌పిల్ దేవ్. పంత్ ను కాపాడిన వారిని ప్ర‌త్యేకంగా అభినందించాడు మాజీ భారత జ‌ట్టు కెప్టెన్. ఇదిలా ఉండ‌గా ప్ర‌మాద స‌మ‌యంలో పంత్ నిద్ర పోతూ కారు న‌డిపిన‌ట్లు ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ కుమార్ వెల్ల‌డించాడు.

Also Read : భార‌త్ సిద్దం లంక స‌న్న‌ద్ధం

Leave A Reply

Your Email Id will not be published!