Jay Shah Comment : షా ట్రబుల్ షూటర్ జేషా కింగ్ మేకర్
బీసీసీఐలో బీజేపీదే రాజ్యం
Jay Shah Comment : ప్రపంచ క్రికెట్ రంగంలో అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది భారత దేశానికి చెందిన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ). వరల్డ్ వైడ్ గా క్రీడా రంగాలలో బీసీసీఐ కూడా చేరి పోయింది.
సాకర్ , టెన్నిస్ తర్వాత క్రికెట్ ఇవాళ విస్మరించ లేని పదంగా మారింది. ఇది పక్కన పెడితే ప్రస్తుతం మరింత పవర్ పుల్ గా తయారైంది బీసీసీఐ(BCCI).
గతంలో ఎందరో బీసీసీఐని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. క్రికెట్ కు జనాదరణ తీసుకు రావడంలో దానికి ఓ లుక్ ఇవ్వడంలో రాజ్ సింగ్ దుంగార్పూర్ ఉంటే పశ్చిమ బెంగాల్ కు చెందిన జగన్మోహన్ దాల్మియా బీసీసీఐ రూపు రేఖలను పూర్తిగా మార్చేశాడు.
ఆటకు వ్యాపారాన్ని జోడించాడు. ఒక రకంగా చెప్పాలంటే దాల్మియా హయాంలో భారత్ ఒక వెలుగు వెలిగింది. ఆటగాళ్లకు కూడా భారీ ఎత్తున ఆదాయం సమకూరింది. బీసీసీఐ ఇక కేంద్రానికి రుణం ఇచ్చే స్థాయికి చేరుకుంది. ఇది అక్షరాల వాస్తవం కూడా.
తనకు వచ్చిన గణనీయమైన ఆదాయానికి సంబంధించి బీసీసీఐ వందల కోట్లకు పైగా పన్ను రూపేణా ఆదాయ పన్ను శాఖకు చెల్లిస్తుందంటే దాని రేంజ్ ఏమిటో, ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.
ఇదంతా పక్కన పెడితే మోదీ ప్రధానిగా కొలువు తీరాక పొలిటికల్ సీన్ మారింది. పూర్తిగా బీజేపీ, దాని అనుబంధ సంస్థలు ప్రభావితం చేస్తూ వచ్చాయి.
కానీ మొత్తం తతంగాన్ని, పాలనా యంత్రాంగాన్ని నడిపేది..నడిపించేది మాత్రం ఒకే ఒక్కడు ట్రబుల్ షూటర్ గా పేరొందిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా(Amit Shah). ఒక్కసారి కమిట్ అయ్యాడంటే తన మాటే తను వినడు అన్న పేరుంది ఆయనకు.
ఎక్కడా ఎక్కువగా మాట్లాడడు. అలా మాట్లాడేందుకు ఇష్టపడడు. ఏదైనా కావాలని అనుకుంటే వెంటనే రంగంలోకి దిగడం, వార్ వన్ సైడ్ అయ్యేలా చేయడం తనకు వెన్నతో పెట్టిన విద్య.
మోదీ రథానికి అమిత్ షా రథ సారథి. ఎంతో మంది నాయకులు ఉన్నా ఖల్ నాయక ఒక్కడే అమిత్ షా. ఇప్పుడు పార్టీలో శక్తివంతమైన నాయకుడిగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ట్రబుల్ షూటర్ కనుసన్నలలోనే భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు పని చేస్తోంది(Jay Shah). ఇది అవునన్నా కాదన్నా వాస్తవం.
గత కొంత కాలం నుంచీ ప్రధానమంత్రి పదే పదే చెబుతూ వస్తున్నారు. బీజేపీలో జోడు పదవులు ఉండకూడదని. కానీ అమిత్ షా, ఇతర నేతలకు వెసులుబాటు ఉంది. ఎందుకంటే షా తనయుడే జే షా(Jay Shah).
బీసీసీఐకి రోజర్ బిన్నీ బాస్ అయినప్పటికీ మొత్తం చక్రం తిప్పుతున్నదంతా జే షానే. బెంగాల్ టైగర్ గా పేరొందిన సౌరవ్ గంగూలీని కూల్ గా పంపించడంలో వారి పాత్ర ఉందంటూ టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీ ఆరోపించింది బహిరంగంగానే.
చివరకు మోదీకి విన్నవించినా ఆయన కూడా ఏమీ చేయలేక పోయాడు. ఎందుకంటే అక్కడ ఉన్నది ఎవరో కాదు అమిత్ షా.
ఆయనతో పాటు క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తమ్ముడు ఇప్పుడు ఐపీఎల్ చైర్మన్ గా ఎంపికయ్యాడు. చెప్పుకుంటూ పోతే బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా మాత్రం కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. ఒక్క బిన్నీ తప్ప ఏ ఒక్కరు క్రీడా మైదానంలో ఆడిన దాఖలాలు లేవు.
ఏది ఏమైనా పవర్ చేతిలో ఉంటే చట్టాలు చుట్టాలవుతాయి. సిద్దాంతాలు మారి పోతాయి. ఇప్పుడు బీసీసీఐ బీజేపీ ఆఫీసుగా మారి పోయిందన్న ప్రతిపక్షాల ఆరోపణలతో ఏకీభవించాలా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలి.
Also Read : మా లక్ష్యం వరల్డ్ కప్ గెలవడం – పాండ్యా