Gayathri Raghuram : ‘కాషాయాని’కి గాయత్రి రఘురామ్ కటీఫ్
బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలైపై ఫైర్
Gayathri Raghuram : ప్రముఖ నటి గాయత్రి రఘురామ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆపై భారతీయ జనతా పార్టీపై నిప్పులు చెరిగారు. ఓ వైపు భారతీయ సంస్కృతి, సాంప్రదాయం, నాగరికత అంటూ చిలుక పలుకులు పలికే పార్టీలో మహిళల పట్ల వివక్ష కొనసాగుతోందని ఆరోపించారు.
ఒక రకంగా మహిళలను ఆట వస్తువులుగా భావిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను బీజేపీకి గుడ్ బై చెపుతున్నట్లు ప్రకటించారు. తాను కాషాయానికి కటీఫ్ చెబుతున్నట్లు వెల్లడించారు గాయత్రి రఘురామ్(Gayathri Raghuram).
నటి సంచలన ఆరోపణలు చేశారు తమిళనాడు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అన్నామలైపై. ఆయన వల్లనే తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు గాయత్రి రఘురామ్.
రాష్ట్రంలో పార్టీ పరంగా పని చేసే మహిళలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ కోసం పని చేసే వారిని పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు.
అన్నామలై తాను సీఎం అయి పోయినట్లు ఫీల్ అవుతున్నారని, గతంలో ఎస్పీగా పని చేసిన ఆయన ప్రస్తుతం పార్టీకి కూడా ఎస్పీ అన్నట్లు వ్యవహరిస్తున్నాడంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు గాయత్రి రఘురామ్(Gayathri Raghuram).
ఇదిలా ఉండగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ వేడుకలకు హాజరయ్యారు గతంలో నటి గాయత్రి రఘురామ్. దీనిని ఆధారంగా చేసుకుని ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు పార్టీ చీఫ్ అన్నామలై.
ఆహ్వానం అందితే తప్పు ఎలా అవుతుందని ప్రశ్నించారు ఈ సందర్భంగా గాయత్రి రఘురామ్. మరో వైపు గాయత్రి రఘురామ్ వెళ్లడం వల్ల ఎలాంటి నష్టం లేదంటోంది బీజేపీ. ప్రస్తుతం గాయత్రి రాజీనామాతో కలకలం రేపుతోంది.
Also Read : వరల్డ్ ఆల్ టైమ్ సింగర్స్ లలో లతా