IND vs SL 2nd T20 : శ్రీలంక భారత్ బిగ్ ఫైట్
రెండో టీ20 మ్యాచ్ పై ఫోకస్
IND vs SL 2nd T20 : భారత, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్ ల టీ20 సీరీస్ లో భాగంగా రెండో టీ20 మ్యాచ్ గురువారం జరగనుంది. ఇప్పటికే ముంబై వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో ఎట్టకేలకు ఇండియా 2 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ తరుణంలో 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది.
ఇవాళ జరిగే మ్యాచ్ లో గెలుపొందితే సీరీస్ గెలిచినట్లవుతుంది. లేదంటే మూడో మ్యాచ్ మరింత ఉత్కంఠ భరితంగా మారే ఛాన్స్ ఉంది. భారత జట్టు మొదట్లో పరుగులు(IND vs SL 2nd T20) చేసేందుకు తడబడింది. ఈ తరుణంలో దీపక్ హూడా, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. గౌరవ ప్రదమైన స్కోర్ సాధించింది. శ్రీలంక ముందు 162 పరుగులు ముందుంచింది.
చివరి దాకా లంకేయులు పోరాడారు. అద్భుతమైన పోరాటాన్ని ప్రదర్శించారు. 2 రన్స్ తేడాతో ఓటమి పాలైంది శ్రీలంక. పుణెలో గెలిచేందుకు భారత్ ఫోకస్ పెట్టింది. ఓపెనర్ శుభ్ మన్ గిల్ తో పాటు చాహల్ ను తీసుకుంటారా లేదా అన్నది తేలాల్సింది. ఇక ఈ సీరీస్ లో సంజూ శాంసన్ గాయపడడంతో అతడి స్థానంలో బీసీసీఐ జితేశ్ శర్మను ఎంపిక చేసింది.
పవర్ ప్లేలో సరిగా ఆడలేక పోవడం గిల్ కు సమస్యగా మారింది. ఇక జితేశ్ ను ఆడిస్తారా లేక రాహుల్ త్రిపాఠిని ఎంపిక చేస్తారనే దానిపై ప్రచారం జరుగుతోంది. డెబ్ల్యూలోనే శివం మావి అద్భుతమైన ప్రదర్శించాడు. ఉమ్రాన్ మాలిక్ కూడా ప్రభావం చూపింది. టీ20 వరల్డ్ కప్ లో చాహల్ నిరాశ పరిచాడు. మరి తీసుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
Also Read : శాంసన్ కు గాయం శ్రీలంక సీరీస్ కు దూరం