Air India CEO : ఎయిర్ ఇండియా ఫ్లైట్ లో మూత్రం చేసిన ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు ఎయిర్ ఇండియాకు నోటీసు జారీ చేసింది. ఇప్పటికే కారకుడైన మిశ్రాపై వేటు వేసింది తను పని చేస్తున్న సంస్థ. బెంగళూరులో అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇందుకు సంబంధించి శనివారం ఎయిర్ ఇండియా సిఇఓ కాంప్ బెల్ విల్సన్(Air India CEO) స్పందించారు. ఈ ఘటన జరగడం దురదృష్టకరమన్నారు. ఇందుకు తాను క్షమాపణ చెబుతున్నానని స్పష్టం చేశారు. విమాన విధానాన్ని సమీక్షిస్తున్నట్లు చెప్పారు. ఈ అనుభవాల గురించి తాము చింతిస్తున్నామని, బాధ పడ్డామని పేర్కొన్నారు సిఇఓ.
ఇక నుంచి ఎయిర్ ఇండియా విమానాలలో ఆల్కహాల్ సేవపై సమీక్షిస్తామని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటి వరకు నలుగురు క్యాబిన్ సిబ్బందితో పాటు ఒక పైలట్ ను తొలగించినట్లు చెప్పారు క్యాంప్ బెల్ విల్సన్. ఇక నుంచి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు సిఇఓ.
ఇతర సిబ్బందిలో కూడా ఏమైనా లోపాలు ఉన్నాయోమోనని ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు. పెండింగ్ లో ఉన్న దర్యాప్తును వేగవంతం చేయాలని ఆదేశించామన్నారు సిఇఓ. విమానంలో ఆల్కహాల్ సేవ, సంఘటన నిర్వహణ, భోర్డులో ఫిర్యాదు నమోదు , నిర్వహణ వంటి అంశాలను ఎయిర్ లైన్స్ దర్యాప్తు చేస్తోందని తెలిపారు.
ఇప్పటికే బాధ్యతాయుతమైన బ్రాండ్ గా ఎయిర్ ఇండియాకు పేరుందని చెప్పారు. ఈ చిన్నపాటి ఘటనల వల్ల పరువు పోయేలా చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక నుంచి అలాంటివి జరగకుండా చేస్తామన్నారు.
Also Read : పరిహారంగా రూ. 15 వేలు చెల్లింపు