Gautam Adani : మేం 22 రాష్ట్రాల్లో వ్యాపారం చేస్తున్నాం

బీజేపీతోనే కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాల్లో కూడా

Gautam Adani : అదానీ గ్రూప్ సంస్థ‌ల చైర్మ‌న్ గౌత‌మ్ అదానీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. త‌న‌పై వ‌స్తున్న ఆరోప‌ణ‌లకు మ‌రోసారి క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాము ఒక్క భార‌తీయ జ‌న‌తా పార్టీతోనే లేమ‌ని కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్న రాష్ట్రాల‌లో కూడా వ్యాపారం చేస్తున్నామ‌ని చెప్పారు.

1980వ ద‌శ‌కంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజీవ్ గాంధీ ప్ర‌ధాన‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో త‌మ కంపెనీ పుంజుకుంద‌ని స్ప‌ష్టం చేశారు. త‌మ కంపెనీ పార‌ద‌ర్శ‌క‌మైన బిడ్డింగ్ ద్వారానే ప్రాజెక్టుల‌ను చేప‌డుతుంద‌ని గౌత‌మ్ అదానీ చెప్పారు. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం నుండి ప్రాధాన్య‌తా ప‌ర‌మైన గౌర‌వం అందుతుంద‌న్న ఆరోప‌ణ‌ల‌ను పారిశ్రామిక‌వేత్త ఖండించారు.

రాజీవ్ హ‌యాంలోనే త‌న విస్తార‌మైన ఓడ రేవులు, అధికార స‌మ్మేళ‌నం ప్రారంభ‌మైంద‌ని చెప్పారు గౌత‌మ్ అదానీ. ఇవాళ 22 రాష్ట్రాల‌లో విస్త‌రించామ‌న్నారు. అన్ని రాష్ట్రాల‌లో బీజేపీ లేద‌న్న విష‌యం గుర్తించాల‌న్నారు. జాతీయ ఛాన‌ల్ తో మాట్లాడారు. కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ఆస‌క్తిని రేపింది. మోదీతో ఇబ్బందులు ఉన్న వారు లేదా సైద్ధాంతిక ప‌ర‌మైన సారూప్య‌త లేని వాళ్లే ఇలాంటి మాట‌లు చెబుతారంటూ పేర్కొన్నారు.

గౌత‌మ్ అదానీ(Gautam Adani). మేం ప్ర‌తి రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెడుతున్నామ‌ని చెప్పేందుకు గ‌ర్వంగా ఉంద‌న్నారు. వామ‌ప‌క్షాల పాల‌న‌లో ఉన్న కేర‌ళ‌లో, టీఎంసీ పాల‌నలో ఉన్న ప‌శ్చిమ బెంగాల్ లో , బిజూ జ‌న‌తాద‌ళ్ సార‌థ్యంలోని ఒడిశాలో, వైసీపీ పాల‌న‌లో ఉన్న ఏపీలో, బీఆర్ఎస్ ప్ర‌భుత్వం ఉన్న తెలంగాణ‌లో కూడా వ్యాపారాలు చేస్తున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

వ్యాపారాలకు రాజ‌కీయాలు ఉండ‌వ‌ని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కూడా పెట్టుబ‌డుల‌ను ప్ర‌శంసించారు. కాంగ్రెస్ పాల‌న‌లో ఉన్న రాష్ట్రంలో రూ. 68,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టామ‌న్నారు.

Also Read : ధీర వ‌నిత‌ అవ‌ని చ‌తుర్వేది

Leave A Reply

Your Email Id will not be published!