IND vs SL 3rd ODI : దంచి కొట్టిన కోహ్లీ చెల‌రేగిన గిల్

శ్రీ‌లంక‌పై భార‌త్ భారీ స్కోర్

IND vs SL 3rd ODI : మూడు వ‌న్డేల సీరీస్ లో భాగంగా శ్రీ‌లంక‌తో జ‌రిగిన మూడో వ‌న్డేలో భార‌త్(IND vs SL 3rd ODI ) భారీ స్కోర్ సాధించింది. ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ దుమ్ము రేపాడు..ఇక స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఇద్ద‌రూ ఒక‌రిని మించి మ‌రొక‌రు పోటా పోటీగా ఆడారు. త‌న కెరీర్ లో ఇది 74వ సెంచ‌రీ. ఇక శ్రీ‌లంక జ‌ట్టుపై కోహ్లీ వంద‌కు పైగా ర‌న్స్ చేయ‌డం ఇది ప‌దవ సారి కావ‌డం విశేషం.

శ్రేయ‌స్ అయ్య‌ర్ 26 ర‌న్స్ చేస్తే..కేఎల్ రాహుల్ , సూర్య కుమార్ యాద‌వ్ నిరాశ ప‌రిచారు. ఇక కోహ్లీ 110 బంతులు ఆడి 8 సిక్స్ లు 13 ఫోర్లు కొట్టాడు. 5 వికెట్లు కోల్పోయి 390 భారీ స్కోర్ చేసింది. శ్రీ‌లంక‌పై అద్భుమైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఇదిలా ఉండ‌గా శుభ్ మ‌న్ గిల్ 116 ప‌రుగుల వ‌ద్ద ఔట్ అయ్యాడు.

కాగా విరాట్ కోహ్లీ 166 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. క‌సున్ ర‌జ‌త రెండు వికెట్లు తీశాడు. శ్రీ‌లంక భారీ టార్గెట్ ముందుంచింది. ఇప్ప‌టికే తొలి , రెండో వ‌న్డేల‌లో భార‌త జ‌ట్టు ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఇప్ప‌టికే హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని భార‌త జ‌ట్టు 2-1 తేడాతో టీ20 సీరీస్ గెలుచుకోగా ప్ర‌స్తుతం వ‌న్డే సీరీస్ కు సంబంధించి 2 మ్యాచ్ ల‌లో స‌త్తా చాటింది.

సంక్రాంతి పండుగ సంద‌ర్భంగా కీల‌క‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకుంది టీమిండియా. శ్రీ‌లంక బౌల‌ర్లకు భార‌త బ్యాట‌ర్లు చుక్క‌లు చూపించారు. మ‌రో వైపు అరుదైన రికార్డు న‌మోదు చేశాడు కోహ్లీ. స‌చిన్ చేసిన 20 సెంచ‌రీల‌ను అధిగ‌మించాడు. 21 సెంచ‌రీలు చేశాడు.

Also Read : 100 సెంచ‌రీలు కోహ్లీకి సాధ్యం

Leave A Reply

Your Email Id will not be published!