CJI Delhi Court : సీజేఐపై విచారణకు కోర్టు నిరాకరణ
సవాల్ చేసిన పిటిషన్ తిరస్కరణ
CJI Delhi Court : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ధనంజయ వై చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై రివ్యూ అభ్యర్థనను ఢిల్లీ కోర్టు(CJI Delhi Court) తిరస్కరించింది. జస్టిస్ సంజీవ్ సచ్ దేవా, జస్టిస్ వికాస్ మహాజన్ లతో కూడిన డివిజన్ బెంచ్ కొట్టి వేసింది.
పిటిషనర్ తాను లేవనెత్తిన అంశానికి సంబంధించి సరైన ఆధారాలు సమర్పించ లేక పోయారని పేర్కొంది ధర్మాసనం. కాగా పిటిషనర్ రాజ్యాంగ నిబంధనలకు విరుద్దంగా నియామకం జరిగిందని పిటిషనర్ వాదించారు. జస్టిస్ చంద్రచూడ్ నియామకాన్ని సవాల్ చేస్తూ ప్రజా ప్రయోజనాల కింద వ్యాజ్యం దాఖలైంది.
పీఐఎల్ కొట్టి వేస్తూ ఇచచ్చిన ఉత్తర్వులపై వేసిన రివ్యూ పిటిషన్ ను ఢిల్లీ కోర్టు సోమవారం కొట్టి వేసింది. నియామకం పూర్తిగా కొలీజియం ఆధారంగా జరుగుతుందని కోర్టు అభిప్రాయ పడింది. ఈ రివ్యూ పిటిషన్ ను రివ్యూగా మారు వేషంలో ఉంచిన అప్పీల్ అని పేర్కొంది. గత వారం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని డివిజన్ బెంచ్ రివ్యూ పిటిషన్ ను విచారణ నుండి విరమించుకుంది.
తాము ఈ పీఐఎల్ ను కొట్టి వేస్తూ ఉత్తర్వులు జారీ చేశాం. రివ్యూ పిటిషన్ ను వేరే బెంచ్ విచారిస్తే తమకు అభ్యంతరం లేదని పేర్కొంది. ఇవాళ విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది.
ఎలాంటి మెటీరియల్ లేకుండానే కేవలం ప్రచారం కోసం మాత్రమే కోర్టులో పిటిషన్ దాఖలైందని ధర్మాసనం పేర్కొంది.
Also Read : హైకోర్టులో అదనపు పోస్టులు