Priyanka Gandhi : పవర్ లోకి వస్తే రూ. 2 వేల సాయం
ప్రకటించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ
Priyanka Gandhi : కర్ణాటకలో రాజకీయాలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించింది. మరో వైపు కాంగ్రెస్ పార్టీ బస్సు యాత్రను ప్రారంభించింది. ఈ సందర్భంగా తాము గనుక అధికారంలోకి వస్తే ప్రతి మహిళ కుటుంబానికి రూ. 2,000 నెల నెలా ఇస్తామని హామీ ఇచ్చారు.
ఈ విషయాన్ని వెల్లడించారు కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka Gandhi) . సోమవారం బెంగళూరులో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళలకు సాయంతో పాటు మరికొన్ని హామీలను ప్రకటించారు ప్రియాంక గాంధీ. కర్ణాటక లోని అన్ని ఇళ్లకు ప్రతి నెలా 200 యూనిట్లు ఉచితంగా విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు.
బెంగళూరులో జరిగిన నా నాయకి కార్యక్రమంలో పాల్గొన్నారు ప్రియాంక గాంధీ. ప్యాలెస్ గ్రౌండ్స్ లో కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం బిగ్ సక్సెస్ అయ్యింది. గీహ లక్ష్మి పథకం పేరుతో 1.5 కోట్ల మంది గృహిణులకు లబ్ది చేకూరుతుందని కేపీసీసీ తెలిపింది.
ప్రియాంక గాంధీ వాద్రా రెండో ఎన్నికల వాగ్ధానాన్ని ఆవిష్కరించనునన్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి కర్ణాటక రాష్ట్రంలో. ఒకరిపై మరొకరు వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధికారంలో ఉన్న బీజేపీ సర్కార్ కు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
గృహ లక్ష్మీ యోజన కింద ప్రతి మహిళకు నెలకు రూ. 2 వేలు ఇస్తామని కర్ణాటక రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ డీకే శివకుమార్ ప్రకటించారు.
Also Read : ఆ ఇద్దరి నుంచి ఎంతో నేర్చుకున్నా