CJI vs Kiren Rijiju Comment : కొలీజియం వ‌ర్సెస్ కేంద్రం

సీజేఐకి కిరెన్ రిజిజు లేఖ క‌ల‌క‌లం

CJI vs Kiren Rijiju Comment : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన‌ న్యాయ స్థానం వ‌ర్సెస్ కేంద్రం సమ‌స్య మ‌ళ్లీ మొద‌టికి వ‌చ్చింది. ఇప్పటికే న్యాయ వ్య‌వ‌స్థ త‌మ కంట్రోల్ లో లేద‌ని ప‌దే ప‌దే న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు పార్ల‌మెంట్ సాక్షిగా ఆరోపించారు. ఆపై కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇదే స‌మ‌యంలో భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ కూడా ఆక్షేప‌ణ తెలిపారు.

పార్ల‌మెంట్ సుప్రీం అని పేర్కొన్నారు. దీనిపై తీవ్ర ర‌గ‌డ చోటు చేసుకుంది. మ‌రోసారి న్యాయ వ్య‌వ‌స్థ‌, కార్య నిర్వాహ‌క వ్య‌వ‌స్థ‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరు మొద‌లైంది. ఇందుకు కార‌ణం న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి (సీజేఐ) ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్(CJI vs Kiren Rijiju) కు లేఖ రాశారు.

ఇందులో ఆయ‌న ప్ర‌త్యేకంగా కొలీజియం వ్య‌వ‌స్థ గురించి ప్ర‌స్తావించారు. అంతే కాకుండా సుప్రీంకోర్టు, హైకోర్టుల‌లో న్యాయ‌మూర్తుల ఎంపికకు సంబంధించి (షార్ట్ లిస్ట్ ) ప్యానెల్ లో కేంద్ర ప్ర‌భుత్వం తర‌పున నామినీ ఒక‌రు ఉండాల‌ని ప్ర‌తిపాదించారు. ఇప్ప‌టికే న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించిన ఫైళ్లు కేంద్రం వ‌ద్ద పెండింగ్ లో ఉన్నాయి.

దీనిపై సీరియ‌స్ గా స్పందించింది సుప్రీంకోర్టు. తీవ్ర అభ్యంత‌రం తెలిపింది. ఇదే విష‌యాన్ని సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ (సీజే)కు స్ప‌ష్టం చేసింది. ప్ర‌త్యేకించి కేంద్రాన్ని త‌ప్పు ప‌ట్టింది. సీరియ‌స్ కామెంట్స్ కూడా చేసింది. ప్ర‌స్తుతం కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మ‌ధ్య టగ్ ఆఫ్ వార్ కొన‌సాగుతోంది.

ఈ స‌మ‌యంలో న్యాయ శాఖ మంత్రి కిరెన్ రిజిజు సీజేఐకి లేఖ రాయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. కొలీజియం సిఫార్సులు చేసిన‌ప్ప‌టికీ న్యాయ‌మూర్తుల నియామ‌కంలో జాప్యం చేసినందుకు కేంద్రంపై ధిక్కార చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అడ్వ‌కేట్స్ అసోసియేష‌న్ ఆధ్వ‌ర్యంలో పిటిష‌న్ దాఖ‌లైంది.

సుప్రీంకోర్టులో చివ‌రి విచార‌ణ ముగిసిన త‌ర్వాత లేఖ వ‌చ్చింది. గ‌త కాలానికి బ్రేక్ వేస్తూ న్యాయ‌మూర్తుల నియామ‌కానికి సంబంధించిన వ్య‌వ‌హారాలు చాలా వ‌ర‌కు ప‌రిపాల‌నా ప‌క్షంగా జ‌రుగుతుండ‌గా జ‌స్టిస్ ఎస్కే కౌల్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం న్యాయ వ్య‌వ‌స్థ వైపు ఈ అంశాన్ని కొన‌సాగించాల‌ని నిర్ణ‌యించి ప్ర‌భుత్వానికి నోటీసు జారీ చేసింది.

పేర్ల‌ను పెండింగ్ లో ఉంచ‌డం ఆమోద యోగ్యం కాద‌ని పేర్కొంది. గ‌త 5 ఏళ్ల‌లో 79 శాతం న్యాయ‌మూర్తులు అగ్ర‌కులాలు, ఎస్సీ, మైనార్టీలు ఒక్కొక్క‌రు 2 శాతం మాత్ర‌మే ఉన్నార‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. సుప్రీంకోర్టు చ‌ర్య‌ల‌ను న్యాయ శాఖ మంత్రి , ఉప రాష్ట్ర‌ప‌తి విమ‌ర్శించ‌డంతో మ‌ళ్లీ క‌థ మొద‌టికి వ‌చ్చింది.

జ‌స్టిస్ కౌల్ కొలీజియంలో స‌భ్యుడిగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా మిమ్మ‌ల్ని మీరే నియ‌మించుకోండి. కేంద్రానికి ఎందుకు ఫైల్స్ పంప‌డం అంటూ కిరెన్ రిజిజు పేర్కొన్నారు. సీజేఐ ఎలా స్పందిస్తారనే దానిపై ఉత్కంఠ నెల‌కొంది.

Also Read : న్యాయ వ్య‌వ‌స్థ‌పై క‌న్నేసిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!