C4IR Hyderabad : త్వరలో హైదరాబాద్ లో సీ4ఐఆర్ సెంటర్
దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో కేటీఆర్
C4IR Hyderabad : సీఎం కేసీఆర్ సారథ్యంలోని భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం అరుదైన ఘనత సాధించింది. ఇప్పటికే దేశంలో ఐటీ పరంగా టాప్ లో కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన దిగ్గజ కంపెనీలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇప్పటికే అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరికాల్ , తదితర కంపెనీలు కొలువు తీరాయి.
ఇంకో వైపు ఫార్మా, లాజిస్టిక్ కంపెనీలు కూడా క్యూ కట్టాయి. ఈ తరుణంలో ఐటీ, పురపాలిక శాఖ మంత్రి కేటీఆర్ సారథ్యంలోని బృందం స్విట్జర్లాండ్ లోని దావోస్ లో ప్రపంచ ఎకనామిక్ ఫోరమ్ ప్రారంభమైంది. ప్రపంచంలోని పలు దేశాలకు సంబంధించిన వ్యాపారవేత్తలు, కార్పొరేట్ లు, దిగ్గజ కంపెనీలు, చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, సిఇఓలు, వివిధ రంగాలకు చెందిన నిపుణులు, దేశాల అధిపతులు, ప్రముఖులు హాజరవుతున్నారు.
ఇప్పటికే కేటీఆర్ బృందం అక్కడికి చేరుకుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ లో తెలంగాణకు తొలి రోజే కీలక విజయం లభించింది. ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మారింది హైదరాబాద్(C4IR Hyderabad) నగరం. ప్రపంచ ఆర్థిక వేదికకు చెందిన సీ4ఐఆర్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గన్స్ , తెలంగాణ ప్రభుత్వ లైఫ్ సెన్సెస్ ఫౌండేషన్ సిఇఓ శక్తి నాగప్పన్ సంతకాలు చేశారు. మంత్రి కేటీఆర్, కార్యదర్శి జయేష్ రంజన్ హాజరయ్యారు. ఇదిలా ఉండగా లైఫ్ సైన్సెస్ హెల్త్ కేర్ రంగంలో ఉన్న అవకాశాలను భారత దేశం అవకాశం అందిపుచ్చు కునేందుకు సెంటర్ దోహద పడుతుందని పేర్కొన్నారు కేటీఆర్.
Also Read : గూగుల్ పై సుప్రీంకోర్టు విచారణ