Suella Braverman Clears : సంజయ్ భండారీ అప్పగింతపై ఓకే
హోం కార్యదర్శి సుయెల్లా బ్రేవర్ మన్
Suella Braverman Clears : సంజయ్ భండారీ అప్పగింతపై బ్రిటీష్ హోం కార్యదర్శి సుయెల్లా బ్రేవర్ మన్ లైన్ క్లియర్ చేశారు. గత ఏడాది 2022 నవంబర్ 7న న్యాయమూర్తి మైఖేల్ స్నో భండారీని అప్పగించాలని ఆదేశించింది. ఈ మేరకు బ్రేవర్ మాన్ ఆమోదం కోసం సూచనను పంపారు. ఈ మేరకు సంజయ్ భండారీ అప్పగింతపై బ్రిటీస్ హోం సెక్రటరీ సుయెల్లా బ్రేవర్ మన్ క్లియర్(Suella Braverman Clears) చేశారు.
లండన్ లోని వెస్ట్ మినిస్టర్ కోర్టు పరారీలోఉన్న ఆయుధ వ్యాపారి సంజయ్ భండారీ ని భారత్ కు అప్పగించాలని ఆదేశించింది. అయితే అప్పగింతపై హైకోర్టులో అప్పీల్ చేసేందుకు భండారీకి ఇప్పుడు 14 రోజుల గడువు ఉందని సమాచారం.
భండారి అప్పగింతకు గత వారం బ్రిటన్ హోం సెక్రటరీ అనుమతి ఇచ్చారు. ఇది అతడిని ఇక్కడికి తీసుకు రావడానికి ఒక అడుగు దగ్గరగా తీసుకు వస్తుందని పేరు చెప్పని ఓ అధికారి వెల్లడించారు. న్యాయమూర్తి మైఖేల్ స్నో భండారిని అప్పగించాలని ఆదేశించింది. బ్రేవర్ మాన్ ఆమోదం కోసం పంపారు.
ప్రతివాది కన్వెన్షన్ హక్కులకు అప్పగించడం అనుకూలంగా ఉందని సంతృప్తి చెందినందున, ప్రతివాదిని అప్పగించాలా వద్దా అనే నిర్ణయం కోసం రాష్ట్ర కార్యదర్శికి పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వం అందించిన హామీల ఆధారంగా మాత్రమే ఇలా చేస్తున్నట్లు తెలిపారు.
సంజయ్ బండారీ భారత దేశంలో విచారణను ఎదుర్కొంటున్నప్పుడు ఆరోగ్య సంరక్షణ నిబంధనలతో న్యూ ఢిల్లీ లోని తీహార్ జైలులో ప్రత్యేక సెల్ లో ఉంచుతారని భారత ప్రభుత్వం అప్పగించిన విచారణల సందర్భంగా హామీ ఇచ్చింది.
Also Read : అబ్దుల్ రెహ్మాన్ మక్కీ గ్లోబల్ టెర్రరిస్ట్