IND vs NZ 1st ODI : శుభ్ మన్ గిల్ ‘డబుల్’ కమాల్
కీవీస్ కు బిగ్ షాక్
IND vs NZ 1st ODI : భారత క్రికెటర్ శుభ్ మన్ గిల్ దుమ్ము రేపాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా బుధవారం న్యూజిలాండ్ తో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఏకంగా డబుల్ సెంచరీ చేసి నాటౌట్ గా నిలిచాడు. ఇటీవల జరిగిన శ్రీలంక సీరీస్ లో కూడా సెంచరీతో ఆకట్టుకున్నాడు ఈ యువ ఆటగాడు.
ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు భారీ స్కోర్ చేసింది. న్యూజిలాండ్(IND vs NZ 1st ODI) బౌలర్లకు చుక్కలు చూపించింది. కేవలం 145 బంతులు మాత్రమే ఎదుర్కొన్న శుభ్ మన్ గిల్ డబుల్ సెంచరీతో మెస్మరైజ్ చేశాడు. తన కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ సాదించడం విశేషం. కీవీస్ పేసర్ ఫెర్గూసన్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్సర్లు కొట్టాడు.
దీంతో స్టార్ పేసర్ విస్తు పోయాడు. కళాత్మకమైన షాట్స్ తో అలరించాడు శుభ్ మన్ గిల్. ఒక రకంగా పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఇక గిల్ ఇన్నింగ్స్ లో మొత్తం 19 ఫోర్లు 8 భారీ సిక్సర్లు ఉన్నాయి. 150 వద్ద ఉండగా సిక్సర్ తో బదులు ఇచ్చాడు. కీవీస్ బౌలర్లు ఏ కోశాన శుభ్ మన్ గిల్ పై ప్రభావం చూపలేక పోయారు.
ప్రతి బౌలర్ ను చితక బాదాడు శుభ్ మన్ గిల్. వాషింగ్టన్ సుందర్ తో కలిసి ఆరో వికెట్ కు 43 రన్స్ జోడించాడు. అంతకు ముందు సెంచరీని 87 బంతుల్లో సాధించాడు. టీమిండియా ప్లేయర్లలో 19 ఇన్నింగ్స్ లు మాత్రమే ఆడి 1,000 రన్స్ పూర్తి చేసి చరిత్ర సృష్టించాడు.
కీవీస్ బౌలర్ టిక్నర్ వేసిన బంతిని ఫోర్ కొట్టి వెయ్యి రన్స్ పూర్తి చేశాడు 32.4వ ఓవర్ లో. అంతకు ముందు విరాట్ కోహ్లీ 24 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు. కోహ్లీ రికార్డును గిల్ బ్రేక్ చేశాడు.
Also Read : రోహిత్..కోహ్లీపై సన్నీ కామెంట్స్