China Effect : చైనా దిగుమ‌తులు భార‌త్ కు క‌ష్టాలు

ఫ‌లించ‌ని మేక్ ఇన్ ఇండియా

China Effect : ఓ వైపు ఆర్థిక మాంద్యం ఇబ్బందుల‌కు గురి చేస్తున్నా మ‌రో వైపు చైనా త‌న దిగుమ‌తులు పెర‌గ‌డం విశేషం. క‌రోనా తీవ్ర ప్ర‌భావం చూపినా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు చైనా(China Effect). ఏప్రిల్ , డిసెంబ‌ర్ 2022 లో చైనాకు భార‌త్ ఎగుమ‌తులు ఏడాదికి 35.58 శాతం క్షీణించ‌గా చైనీస్ డిమాండ్ కార‌ణంగా $11.03 బిలియ‌న్ల‌కు ప‌డి పోయింది.

అదే స‌మ‌యంలో చైనా నుండి దిగుమ‌తులు దాదాపు 12 శాతం పెరిగి $75.87 బిలియ‌న్ల‌కు చేరుకోవ‌డం గ‌మ‌నార్హం. ఎల‌క్ట్రిక‌ల్ మెషిన‌రీ , ఫ‌ర్నీచ‌ర్ , మెడిక‌ల్ ఇన్ స్ట్రుమెంట్స్ , బిలియ‌న్ డాల‌ర్ల విలువైన కిచెన్ సామాన్లు, ఫోర్క్ ల‌తో స‌హా చైనీస్ ఫినిష్డ్ వ‌స్తువుల దిగుమ‌తులు పెరిగాయి. దీంతో భారత ప్ర‌భుత్వం ఆందోళ‌న చెందుతోంది.

ఇది మోదీ పేర్కొంటున్న ఆత్మ నిర్భ‌ర్ భార‌త్ పై భారీగా ఎఫెక్ట్ ప‌డుతోంది. ప్ర‌ధానంగా చైనా నుండి ముడి ప‌దార్థాలు, విలువ ఆధారిత వ‌స్తువుల‌ను పెద్ద ఎత్తున త‌యారు చేస్తోంది చైనా. దీని వ‌ల్ల భార‌త్ కు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 2021లో $21.61 బిలియ‌న్ల విలువైన 85 వ‌స్తువుల‌ను దిగుమ‌తి చేసుకుంది.

ఇక దిగుమ‌తి చేసుకున్న వ‌స్తువుల‌లో చాలా వ‌స్తువుల‌ను భార‌త దేశంలోనే స్వంతంగా త‌యారు చేసుకోవ‌చ్చ‌ని మార్కెట్ రంగ నిపుణులు చెబుతున్నారు. చైనా(China Effect) నుండి భార‌త దేశం ప్ర‌తి సంవ‌త్స‌రం 20 బిలియ‌న్ డాల‌ర్ల విలువైన మూల‌ధ‌న వ‌స్తువులు, యంత్రాల‌ను దిగుమ‌తి చేసుకుంటోంది. ఇది 10 ఏళ్ల‌లో $200 బిలియ‌న్లు కావ‌డం విశేషం.

భార‌త ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా మేక్ ఇన్ ఇండియా అని ప్ర‌వేశ పెట్టింది. కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంది. కానీ ప‌థ‌కం బాగానే ఉన్నా ఆచ‌ర‌ణ‌లో ఆశించిన ఫ‌లితం రాలేదు.

Also Read : త‌లుపు తెరిచిండు క్ష‌మాప‌ణ చెప్పిండు

Leave A Reply

Your Email Id will not be published!