Vinesh Phogat : ఎంపీ నిర్వాకం రెజ్లర్ భావోద్వేగం
లైంగికంగా వేధిస్తున్నాడని కంటతడి
Vinesh Phogat : భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రస్తుతం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు భారత రెజ్లర్స్ సంఘం (డబ్ల్యూఎఫ్ఐ) కు అధ్యక్షుడిగా ఉన్నారు. విచిత్రం ఏమిటంటే దేశ రాజధానిలో కాకుండా రెజ్లర్లకు సంబంధించిన శిక్షణ శిబిరాన్ని తన స్వంత ఇంట్లో పెట్టాడంటూ మహిళా రెజ్లర్లు ఆరోపించారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు రోడ్డుపైకి వచ్చారు. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను వెంటనే తప్పించాలని లేకపోతే తాము ఆందోళన విరమించే ప్రసక్తి లేదంటూ హెచ్చరించారు. దీంతో కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది.
72 గంటల్లోపు వివరణ ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా ప్రముఖ రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన ఆరోపణలు చేసింది. ఆపై తనను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని వాపోయింది. బయటకు చెబితే చంపుతామంటూ బెదరింపులకు గురి చేస్తు్నారని ఆవేదన చెందింది.
తనతో పాటు చాలా మంది బయటకు చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఒకవేళ తాను ఉంటానో ఉండనో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఎవరైనా తన స్వంత ఇంట్లో శిక్షణా శిబిరాన్ని నిర్వహిస్తారా అని ప్రశ్నించింది. మీడియా ఎదుట కన్నీళ్లు పెట్టింది ఫోగట్. దేశ రాజధానిలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టారు.
బ్రిజ్ భూషణ్ తో పాటు అనేక మంది కోచ్ లు లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్న్నారని ఆరోపించింది. 12 మంది అమ్మాయిలు తమ గోడును నాకు చె్పారు. వారి పేర్లు తాను బయటకు చెప్పనని పేర్కొంది. ప్రధాని మోదీని కలిసేందుకు ఛాన్స్ ఇస్తే ఆయన ముందే చెబుతానని తెలిపింది. ఆ ఎంపీ వల్ల ఒకానొక సమయంలో సూసైడ్ చేసుకోవాలని అనుకున్నానని ఆరోపించింది వినేశ్ ఫోగట్(Vinesh Phogat).
Also Read : ‘సింగ్’ వేధించడంలో కింగ్