Anurag Thakur Meet : చర్చలు విఫలం పోరాటం ఉధృతం
బ్రిజ్ భూషణ్ వితండ వాదం
Anurag Thakur Meet : మీటూ వివాదంలో ఇరుక్కున్న భారతీయ జనతా పార్టీ ఎంపీ, భారత రెజ్లర్ల సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పాతపాటే పాడుతున్నారు. 30 మందికి పైగా మహిళా రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. శుక్రవారం నాటికి మూడో రోజుకు చేరుకుంది దీక్ష చేపట్టి. రాజకీయ పార్టీలను ఎవరినీ దగ్గరకు రానివ్వడం లేదు ఆందోళనకారులు.
గత కొంత కాలంగా నియంతృత్వ పోకడ పోతున్నారని, లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడంటూ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్ పై ఆరోపణలు చేశారు. ఆయన అండ చూసుకుని కోచ్ లు కూడా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది ఈ వ్యవహారం.
72 గంటల సమయం క్రీడా శాఖ ఇచ్చింది వివరణ కోరింది డబ్ల్యూఎఫ్ఐకి. అయితే కావాలని తనను బద్నాం చేసేందుకే రెజ్లర్లు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ ఆరోపించారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. అర్ధరాత్రి దాకా చర్చలు జరిపారు మహిళా రెజ్లర్లతో కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.
గురువారం అర్ధరాత్రి 2 గంటల దాకా రెజ్లర్లతో చర్చలు జరిపారు. కానీ ముందుకు సాగలేదు. సమాఖ్య నుండి మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన కోరినందు వల్ల వేచి ఉండాలని మహిళా రెజ్లర్లకు సూచించారు కేంద్ర మంత్రి(Anurag Thakur). ఇదిలా ఉండగా మూడు రోజుల్లో డబ్ల్యుఎఫ్ఐ స్పందించక పోతే క్రీడా మంత్రిత్వ శాఖ నేషనల్ స్పోర్ట్స్ డెవలప్ మెంట్ కోడ్ ,2011 రూల్స్ ప్రకారం సమాఖ్యపై చర్య తీసుకుంటుందని ఇప్పటికే స్పష్టం చేసింది.
Also Read : సింగ్ ను సాగనంపేంత దాకా సమరమే